STOCKS

News


తీవ్ర హెచ్చుతగ్గులు: నష్టాలతో ముగింపు

Friday 28th September 2018
Markets_main1538130209.png-20681

ముంబై:- శుక్రవారం ట్రేడింగ్‌ అద్యంతం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ చివరికి నష్టంతో ముగిసింది. బలహీనమైన మార్కెట్‌ పరిస్థితులు సూచీల నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. అటో, మెటల్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 35,227 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 10,696 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35177 - 35438 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,850 - 10,977.55 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ 77.70 పాయింట్లు లాభపడి 25,120 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 128 పాయింట్ల లాభంతో 36,452 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సూచీలు స్వల్పలాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, బలహీనమైన మార్కెట్‌ పరిస్థితులు సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. అటుతర్వాత లాభాల్లోకి మళ్లింది. మళ్లీ తీవ్ర నష్టాల్లోకి జారి, నిఫ్టీ ఇటీవలి కనిష్టస్థాయి 10,860 దిగువకు పడిపోయింది. తదుపరి చివరి అరగంటలో నష్టాల నుంచి కొంతవరకూ కోలుకుంది. మార్కెట్‌ ముగిసే సమయానికి ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. మెటల్‌, రియల్టీ, అటో, ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకు రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
- ఈ సెప్టెంబర్‌లో నిఫ్టీ సూచీ 7శాతం నష్టపోగా, సెన్సెక్స్‌ 6.83శాతం నష్టపోయింది.
టాటాస్టీల్‌, హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, ఇండియన్‌బుల్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 5నుంచి 9శాతం నష్టపోగా, విప్రో, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

3 నెలల వరకూ పాజిటివ్‌ రిటర్న్స్‌కు నో ఛాన్స్‌..

Friday 28th September 2018

ఈక్విటీ మార్కెట్లు వచ్చే మూడు నెలలపాటు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందించకపోవచ్చని ఇండియా జెన్‌ ఫండ్‌ డైరెక్టర్‌/ సీఐవో, పీఎంఎస్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) మనీశ్‌ సంతాలియా తెలిపారు. ఆగస్ట్‌ 28 నాటి రికార్డ్‌ గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్‌ 2,500 పాయింట్లకుపైగా పతనమైందని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కారణంగా తలెత్తిన లిక్విడిటీ భయాలు, రూపాయి అస్థిరత, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపారు. ‘ప్రస్తుత పతనం

యస్‌ బ్యాంక్‌...ఈ ధరలో యస్సేనా?

Friday 28th September 2018

ఎడిల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ (ఇన్‌స్టిట్యూనల్‌ ఈక్విటీస్‌) నిశ్చల్‌ మహేశ్వరి తాజాగా కరెక‌్షన్‌ తర్వాత యస్‌ బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లను ఏవిధంగా చూడాలి? మెటల్స్‌లో టాప్‌-4 స్టాక్స్‌ ఏంటి? అనే పలు అంశాలను తెలియజేశారు. అవేంటో ఆయన మాటాల్లోనే..  ♦ బ్యాంక్‌ను ఎవరు ముందుండి నడుపుతారనే అంశంపై స్పష్టత వచ్చే వరకు యస్‌ బ్యాంక్‌లో అస్థిరత కొనసాగుతుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరపు ప్రైస్‌-టు-బుక్‌ (పుస్తక విలువ) అంచనాలకు 1.2 రెట్లు, 1.3-1.4 రెట్లు వద్ద

Most from this category