STOCKS

News


రెండోరోజూ లాభాల ముగింపే...

Tuesday 16th July 2019
Markets_main1563273441.png-27106

234 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌
రాణించిన ఫార్మా షేర్లు

దేశీయ స్టాక్‌ మార్కె్‌ట్‌ వరుసగా రెండో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 234 పాయింట్లు పెరిగి 39,131 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11662 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెలకొన్నప్పటికీ.., నేడు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభించింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతానికి పైగా లాభపడింది. ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, అటో, ఫైనాన్స్‌ సెక్టార్‌, రియల్టీ రంగ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల మద్దతులో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం పెరిగి 30,576.35 వద్ద ముగిసింది. అయితే, ఐటీ, మీడియా రంగ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,573.95-11,670.05 రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ 329 పాయింట్లు పెరిగి 39,173.89 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, సన్‌ఫార్మా, అదానీపోర్ట్స్‌, టాటామోటర్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 14శాతం లాభపడగా, యూపీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం క్షీణించాయి. 



You may be interested

మార్చినాటికి నిఫ్టీ @12,900!

Tuesday 16th July 2019

నోమురా అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి నిఫ్టీ టార్గెట్‌ 12900 పాయింట్లని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ నోమురా ప్రకటించింది. దేశీయ మార్కెట్‌పై సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఏడాది కాలానికి దేశీయ మార్కెట్లపై పాజిటివ్‌గా ఉన్నామని, బడ్జెట్లో ప్రకటించిన చర్యలన్నీ పెట్టుబడి సైకిల్‌ను ముందుకు నడిపేవిగా ఉన్నాయని నోమురా ఇండియా రిసెర్చ్‌ హెడ్‌ సైయోన్‌ ముఖర్జీ చెప్పారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడం, బ్యాంకింగ్‌ రంగంలో రుణ కేటాయింపులు తగ్గడమనేవి దేశీయ మార్కెట్‌కు ‍ప్రధాన

ఇప్పటికీ టీసీఎస్‌ మా టాప్‌ బెట్‌!

Tuesday 16th July 2019

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌ టైర్‌ 1 ఐటీ షేర్లలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌పై బుల్లిష్‌గా ఉన్నామని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి అపూర్వ ప్రసాద్‌ చెప్పారు. ఇన్ఫీ ఫలితాలు బాగున్నా, ఇప్పటికీ టీసీఎస్‌ తమ టాప్‌ బెట్‌ అని చెప్పారు. మిడ్‌క్యాప్‌ ఐటీ షేర్లలో ఎంఫసిస్‌, హెక్సావేర్‌పై బుల్లిష్‌గా ఉన్నామన్నారు. ఈ రెండు షేర్ల వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, వీటి వ్యాపారాల్లో చురుకుదనం పెరిగిందని తెలిపారు. ఇటీవలి ఫలితాల అనంతరం

Most from this category