STOCKS

News


ఆగని రికార్డుల హోరు

Thursday 9th August 2018
Markets_main1533811328.png-19108

  • సూచీల మరో కొత్త రికార్డు ముగింపు 
  • 38వేల శిఖరంపైకి సెన్సెక్స్‌

ముంబై:- మార్కెట్‌లో సూచీల రికార్డు ర్యాలీ ఆగడం లేదు. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల అండతో రెండో రోజూ అటు ఇంట్రాడేలోనూ, ఇటు ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభపడి 38024 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 38000 శిఖరాన్ని అధిరోహించి 38076 వద్ద తన జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 11,495 వద్ద ఆల్‌టైం హైని నమోదు చేసింది.ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌, మెటల్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, రంగాలకు చెందిన సూచీలు లాభపడగా ఫార్మా, అటో, ఐటీ రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ 257 పాయింట్లు లాభపడి మొదటిసారిగా 28,363 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
ట్రేడ్‌ వార్‌ కారణంగా ప్రపంచమార్కెట్‌ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనప్పటికి దేశీ మార్కెట్‌ మాత్రం వరుసగా రెండో రోజూ లాభాలతో ప్రారంభమైంది. గత రికార్డు ముగింపును అందుకున్న బెంచ్‌మార్క్‌ సూచీలు నేడు మరో సరికొత్త రికార్డు వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభంతో 37,995 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,493 పాయింట్ల వద్ద  ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్‌ తొలిసారి 38,000 పాయింట్ల మైలురాయిని అందుకోగా, నిఫ్టీ 11,495 వద్ద మరోసారి తన జీవితకాల గరిష్టస్థాయిని నమోదు చేశాయి. సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయి.

బ్యాంకు షేర్లు భళా:-
నేటి ట్రేడింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు అత్యుత్తమంగా రాణించాయి. ఈ మూడు షేర్లు నేడు నిఫ్టీ- 50 గెయినర్లలో చోటు దక్కించుకున్నాయి. ఈ షేర్ల అండతోనే ఉదయం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు తన జీవతకాల గరిష్టాలను అందుకోగలిగాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంకు ఇంట్రాడేలో 8.51 శాతం లాభపడి రూ.345.85ల వద్ద ఆరునెలల గరిష్టానికి చేరుకుంది. చివరికి 4శాతం లాభంతో రూ.332 వద్ద ముగిసింది. మరో ప్రైవేట్‌ రంగ బ్యాంకు యాక్సిస్‌ బ్యాంకు 5శాతం లాభపడి 624.40 గరిష్టాన్ని తాకి చివరికి 4.20శాతం లాభంతో 621 వద్ద ముగిసింది. మరో ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఇంట్రాడేలో 3.50 శాతం లాభపడి రూ.319.85 వద్ద ఆరునెలల గరిష్టానికి చేరుకుంది. చివరికి 3శాతం లాభంతో రూ.317.65ల వద్ద ముగిసింది.
ఫార్మా షేర్లకి జ్వరం:-
బ్యాంకింగ్‌, మెటల్‌ అండతో సూచీలు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నప్పటికీ.., ఫార్మా షేర్లు మాత్రం నిరుత్సాహపరిచాయి. వరసుగా రెండో ట్రేడింగ్‌లో ఫార్మా షేర్లు నీరసించాయి. సిప్లా, అరబిందో ఫార్మా, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 2శాతానికి పైగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ సూచీల్లో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్‌ అరశాతానికిపైగా నష్టపోయింది.
ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, టైటాన్‌, భారతీఎయిర్టెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 4.75శాతం నష్టపోగా, వేదాంత, ఎస్‌బీఐ, హిందాల్కో, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు 2.50శాతం నుంచి 4.20శాతం వరకు లాభపడ్డాయి.



You may be interested

లాభాలు.. అంతలోనే నష్టాలు..

Friday 10th August 2018

స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే వెంటనే నష్టాలోకి జారిపోయింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,024 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,471 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 11,475 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డ్‌ స్థాయిలను తాకిన విషయం తెలిసిందే. అమెరికా మార్కెట్లు గురువారం స్వల్పంగా తగ్గడం, 

పేటీఎం మాల్‌ నుంచి ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌

Thursday 9th August 2018

పండుగ సీజన్‌ అమ్మకాలను పేటీఎం మాల్‌ ఆరంభించింది. ఫ్రీడమ్‌ క్యాష్‌బ్యాక్‌ సేల్‌ ఆఫర్‌ పేరిట కొత్త సీజన్‌ను షురూ చేసింది. ఈ నెల 8 నుంచి 15 మధ్యన ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆఫర్‌లో భాగంగా మొబైల్స్‌, ఫాషన్‌, అప్లయెన్సెస్‌, ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌, కిచెన్‌ అండ్‌ హోమ్‌ తదితర విభాగాలకు చెందిన పది కోట్ల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచినట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ కోసం పేటీఎం మాల్‌

Most from this category