STOCKS

News


3 వారాల కనిష్టస్థాయి వద్ద ముగింపు

Tuesday 23rd April 2019
Markets_main1556015712.png-25295

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి నష్టాలతో ముగిశాయి. అటో, బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల పతనం సూచీల లాభాలకు గండి కొట్టింది. ఫలితంగా మార్కెట్‌ మంగళవారం వరుసగా మూడో రోజూలతో ముగిసింది. సెన్సెక్స్‌ 80 పాయింట్లు నష్టపోయి 38565 వద్ద, నిఫ్టీ 18.50 క్షీణించి11576 వద్ద స్థిరపడింది. మార్చి 29 తర్వాత ఈ స్థాయిలో సూచీలు ముగియడం ఇదే ప్రధమం. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 208 పాయింట్లను నష్టపోయి 29,479 వద్ద స్థిరపడింది. క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో ముడిచమురు ధరల మంటతో భారీగా నష్టపోయి సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌ కారణంగా ఒకానొకదశలో సెన్సెక్స్‌ 187 పాయింట్లు లాభపడి 38,832 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11645 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు సూచీలను నష్టాల్లోకి మళ్లించాయి. నేడు దేశవ్యాప్తంగా మూడో మూడో దశ పోలింగ్‌ జరగనుండంతో పాటు మరో రెండు రోజుల్లో(గురువారం) డెరివేటివ్స్‌ ముగింపు ఉండటం, యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టస్థాయి నుంచి 335 పాయింట్లను కోల్పోయి 38,518 వద్ద, నిఫ్టీ ఇంట్రాడే హై నుంచి 60 పాయింట్లను కోల్పోయి 11,565 వద్ద పతనమయ్యాయి. అటో, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరగ్గా, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, మీడియా రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. 

హీరోమోటోకార్ప్‌, ఇండస్‌ ఇండ్‌, టాటాస్టీల్‌, యస్‌ బ్యాంక్‌, మారుతీ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్‌, ఓఎన్‌జీసీ షేర్లు 1.50శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

పొజిషన్లు తగ్గించుకోవడం మంచిది!

Tuesday 23rd April 2019

క్రూడ్‌; వీఐఎక్స్‌లో అనూహ్య పెరుగుదల అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర అనూహ్య పెరుగుదల, ఇండియా వీఐఎక్స్‌ మూడేళ్ల గరిష్ఠానికి చేరడంతో ఈక్విటీలపై అప్రమత్తంగా ఉండాలని ఇన్వెస్టర్లను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండింటి ప్రభావంతో ట్రేడర్లు తమ పొజిషన్లు తగ్గించుకోవడంతో పాటు బుల్లిష్‌ బెట్స్‌ను వదులుకుంటున్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఉత్సాహంతో సూచీల్లో లాంగ్‌ పొజిషన్ల ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ భారీగా పెరిగింది. కానీ ఒక్కమారుగా మార్కెట్‌ను చుట్టుముట్టిన భయాలతో

ఈ స్టాకుల్లో కరెక‌్షన్‌కు అవకాశం!

Tuesday 23rd April 2019

సోమవారం ముగింపు ప్రకారం 127 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా బలహీనంగా మారిన షేర్లలో సుజ్లాన్‌ ఎనర్జీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, భెల్‌, ఐడీబీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వొకార్డ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఫ్యూచర్‌ కన్జూమర్‌, జేకే పేపర్‌, మార్కసాన్స్‌ ఫార్మా, ధనలక్ష్మి బ్యాంక్‌, టాటా కెమికల్స్‌,

Most from this category