దలాల్ స్ట్రీట్‌లో వాల్‌స్ట్రీల్ మంటలు
By Sakshi

759 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
10,250ల దిగువకు నిఫ్టీ
వాల్‌స్ట్రీట్‌లో బుధవారం రాత్రి రాజుకున్న అమ్మకాల మంటలు సెగలు గురువారం మన మార్కెట్‌ను తాకాయి. ఫలితంగా ఐటీ, ఫైనాన్షియల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఈ ఏడాదిలో ఆర్జించిన లాభాలన్నీ కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1038 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌సెషన్‌లో సూచీలు కొంత రికవరీ బాటలో సాగినప్పటికి.., ఆ ర్యాలీ ఎంతోసేపు నిలువలేదు యూరప్ మార్కెట్లో 20నెలల కనిష్టం వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించడంతో మార్కెట్లో మళ్లీ అమ్మకాలు మొదలయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి సెన్సెక్స్ 759 పాయింట్లు కోల్పోయి 34001 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు నష్టపోయి 10234ల వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 537 పాయింట్లు క్షీణించి 24,784 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో అన్ని రంగాలకు చెంది సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వ రంగ ఇండెక్స్ 5శాతం నష్టపోయింది.
వాల్‌స్ట్రీట్ సెగలు:-
భారీ నష్టాల్లోంచి తేరుకుని బుధవారం లాభాల్లోకి అడుగుపెట్టిన దలాల్ స్ట్రీట్‌కు నేడు (గురువారం) వాల్‌స్ట్రీట్ సెగ తగిలింది. దీనికి తోడు నేటి ఇంట్రాడే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కొత్త కనిష్టానికి పతనమవ్వడంతో మన మార్కెట్ భారీగా నష్టపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 697 పాయింట్ల నష్టంతో 34,063 పాయింట్ల వద్ద, నిఫ్టీ ఏకంగా 291 పాయింట్ల నష్టంతో 10,169 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. గంటగంటకు పెరిగిన అమ్మకాలతో సూచీలు ఆరంభంలోనే కీలక సూచీలు భారీగా కుప్పకూలాయి. ఓ దశలో సెన్సెక్స్ 1038 పాయింట్లను కోల్పోయి 33,723.53 వద్దకు, నిఫ్టీ సూచి 392 పాయింట్లు నష్టపోయి 10,138.60 వద్దకు పతనమయ్యాయి.
మిడ్‌సెషన్‌లో స్వల్ప రికవరీ:-
మిడ్‌సెషన్ సమయానికి మార్కెట్లో అమ్మకాల సునామీ తగ్గడంతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ బాట పట్టాయి. సెన్సెక్స్ సూచీ ఇంట్రాడే కనిష్టస్థాయి(33,723)నుంచి 600 పాయింట్లు కోలుకుని 34,325 వద్దకు, నిఫ్టీ సూచీ కనిష్టస్థాయి(10,138.60)నుంచి 194 పాయింట్లు రికవరీ అయ్యి 10,335.95 స్థాయికి రీకవరీ అయ్యాయి.
మళ్లీ మొదలైన అమ్మకాలు:-
రికవరీ బాటలో సాగుతున్న సూచీలు యూరప్ మార్కెట్లు షాక్‌నిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న బలహీనతకారణాలతో యూరప్ మార్కెట్లు 20నెలల కనిష్టం వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించగా, ఆసియాలో మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. దీంతో మార్కెట్లో మరోసారి అమ్మకాల సునామి మొదలైంది. మిడ్ సెషన్ నుంచి మార్కెట్ ముగింపు వరకు కొనసాగిన అమ్మకాలతో చివరకు సెన్సెక్స్ 759 పాయింట్లు కోల్పోయి 34001 వద్ద, నిఫ్టీ 225 పాయింట్లు 10234ల వద్ద ముగిసింది
హిందాల్కో, టాటాస్టీ్ల్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇండియాబుల్ హౌసింగ్ఫైనాన్స్ షేర్లు 5శాతం నుంచి 9శాతం వరకు నష్టపోయాయి. యస్‌బ్యాంక్, గెయిల్, బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ షేర్లు 3శాతం నుంచి 16శాతం నష్టపోయాయి.
మార్కెట్ విశేషాలు:-
- ఎన్ఎస్ఈలో 235 షేర్లు తాజాగా 52-వారాల కనిష్టానికి చేరుకున్నాయి.
- ఇంట్రాడేలో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 27 పైసలు నష్టపోయి 74.48 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది.
- కేవలం 5 నిమిషాల్లో సుమారు రూ.4లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది.
- ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలపై ఎక్సైంజ్ సుంకాన్ని 14శాతం నుంచి 11శాతానికి తగ్గించడంతో ఏవియేషన్ షేర్లు లాభపడ్డాయి.
- అంతర్జాతీయ ముడిచమురు ధరలు రెండువారాల కనిష్టానికి చేరుకోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల హెచ్‌పీసీఎల్, ఐఓసీ, గెయిల్, ఓఎన్జీసీ, బీపీసీఎల్ షేర్లు 10.66శాతం నుంచి 3.66శాతం వరకు లాభపడ్డాయి.
- ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఎస్బీఐ, ఐటీసీ షేర్ల పతనం సూచీలను భారీగా నష్టపోయేలా చేశాయి.
You may be interested
ఈ మూడింటిలో వ్యాల్యుయేషన్‌కు ఛాన్స్..
Thursday 11th October 2018మార్కెట్ ఇంకా ఓవర్వ్యాల్యుతోనే ఉందన్నారు మెర్కులస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఫౌండర్ సౌరభ్ ముఖర్జీ. ఇండియన్ మార్కెట్ తన ఫెయిర్ వ్యాల్యుకు 10-15 శాతం దూరంలో ఉందని తెలిపారు. అయితే ఐటీ, ఫార్మా, ఎగుమతి ఆధారిత ఆటో రంగ స్టాక్స్‌లో విలువకు అవకాశముందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మార్కెట్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఓవర్ వ్యాల్యుయేషన్స్‌తో ఉన్నాయని తెలిపారు. వీటిల్లో ఇంకా
మరో 15 శాతం పతనం మిగిలేఉంది!
Thursday 11th October 2018నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లో కరెక్షన్ క్లోజయిందని భావిస్తున్నారా? మెల్లగా కొనుగోళ్లు జరుపుతున్నారా? జాగ్రత్త... సూచీల్లో ఇంకో 15 శాతం పతనం మిగిలిఉందని మార్కెట్ పండితులు హెచ్చరిస్తున్నారు. సూచీలు తమ సరైన వాల్యూలకు ఇంకా 10- 15 శాతం అధికంగా ట్రేడవుతున్నాయని ప్రముఖ అనలిస్టు సౌరవ్ ముఖర్జీ చెప్పారు. 2008లో అంతర్జాతీయ సంక్షోభాన్ని ముందుగా ఊహించిన అనలిస్టుగా ఈయనకు మంచి పేరుంది. ప్రస్తుతం సూచీలు ఆగస్టు స్థాయిలతో పోలిస్తే దాదాపు 14