భారీ లాభంతో ముగింపు
By Sakshi

ముంబై:- రూపాయి రికవరీతో పాటు ముడిచమురు ధరలు చల్లారడంతో శుక్రవారం మార్కెట్ లాభాల్లో ముగిసింది. గత రెండు రోజులుగా ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాలు తగ్గడంతో దేశీయ సూచీలు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడష్సెషన్ సమయానికి సూచీలు క్రితం ట్రేడింగ్‌లో కోల్పోయిన లాభాలను పూడ్చుకోగలిగాయి. అనంతరం యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసానిచ్చింది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 732 పాయింట్లు లాభపడి 34733.58 వద్ద, నిఫ్టీ 237.85 పాయింట్లు పెరిగి 10472.50 వద్ద ముగిశాయి.
ఎన్ఎస్ఈలో అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ముగిసినప్పటికి, రూపాయి రికవరీ కారణంగా ఒక్క ఐటీ ఇండెక్స్ మాత్రం నష్టాల్లో ముగిసింది. అత్యధికంగా అటో, మెటల్ ఇండెక్స్‌లు 4శాతం లాభంతో ముగిశాయి. ఇంట్రాడే నిఫ్టీ సూచీ 258 పాయింట్ల వరకు లాభపడి 10,492.45స్థాయిని అందుకుంది. సెన్సెక్స్ 807 పాయింట్ల లాభాల్ని ఆర్జించి 34,808.42స్థాయికి ఎగిసింది. ఇక వారం వారీగా చూస్తే సెన్సెక్స్ సూచీ(1శాతం) 356పాయింట్లు లాభపడగా, నిఫ్టీ(1.50శాతం) 156 పాయింట్లు పెరిగింది.
టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్ షేర్లు 1నుంచి 3శాతం నష్టపోగా, హెచ్‌పీసీఎల్, ఎంఅండ్ఎం, ఐషర్‌మోటర్స్, బజాజ్‌ఫైనాన్స్, మారుతి ఇండెక్స్ షేర్లు 5నుంచి 6.50శాతం లాభపడ్డాయి.
You may be interested
నిండా ముంచేసిన ఐపీవోలు
Friday 12th October 2018సెకండరీ మార్కెట్లో నష్టాలు ఇన్వెస్టర్లకు సుపరిచితమే. కానీ, ఇటీవలి కాలంలో ప్రైమరీ మార్కెట్లో భాగమైన ఐపీవోలు కూడా ఇన్వెస్టర్లను లబోదిబోమనేలా చేస్తున్నాయి. నష్టాలతో నిండా ముంచేస్తున్నాయి. 2017 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఐపీవోల్లో రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజు కలిగిన వాటిని పరిశీలిస్తే... అధిక శాతం లాభాల నుంచి నష్టాల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రూ.1,000 కోట్లకు పైగా ఇష్యూ సైజుతో ఐపీవోకు వచ్చి మార్కెట్లో లిస్ట్
732 = 237.. ఎలా?
Friday 12th October 2018732 = 237 .. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా? ఇండియన్ స్టాక్ మార్కెట్లో శుక్రవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు రెండూ భారీ లాభాల్లోనే ముగిశాయి. అయితే ఇక్కడే ఆ గమత్తు దాగుంది. సెన్సెక్స్ లాభాన్ని తిరగేసి రాస్తే నిఫ్టీ లాభం వస్తుంది. అందేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూడండి.. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 732 పాయింట్ల (2.15 శాతం) లాభంతో 34,733 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ