STOCKS

News


10,700పైన నిఫ్టీ ముగింపు

Wednesday 12th December 2018
Markets_main1544610294.png-22866

  • 629 పాయింట్ల లాభపడి సెనెక్స్‌

ఆర్‌బీఐ నూతన ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకానికి మార్కెట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో  సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. అటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాల ట్రేడింగ్‌ సూచీల ర్యాలీకి నేతృత్వం వహించాయి. నిఫ్టీ సూచీ 10700 మార్కును అందుకోగా, సెన్సెక్స్‌ 629 పాయింట్లను ఆర్జించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు గంటకు గంటకు తమ లాభాలను పెంచుకుంటూ వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతారణం కూడా సూచీల ర్యాలీకి సహకరించింది. మార్కెట్‌ ముగిసే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 629 పాయింట్ల లాభంతో 35,779 వద్ద, నిఫ్టీ సూచీ 188 పాయింట్లు పెరిగి 10,737 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం పెరిగి 26,645 వద్ద ముగియగా, అత్యధికంగా అటో ఇండెక్స్‌ 3.50శాతం లాభపడింది. అలాగే మెటల్‌ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ 2శాతం పెరిగాయి.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
ఆర్‌బీఐ కొత్త ఛైర్మన్‌ నియమాకంపై కోటి ఆశలతో పలు ప్రతికూల అంశాలను అధిగమిస్తూ నేడు మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ సెంచరీకి పైగా(125) పాయింట్ల లాభంతో 35,277 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల పెరిగి 10,591 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి అటో, మెటల్‌, బ్యాంకింగ్‌, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ షేర్లలో కొనుగోళ్లతో మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 400పాయింట్లను సాధించగా, నిఫ్టీ సూచి తనకు కీలకమైన 10650 మార్కును అందుకుంది. మిడ్‌సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానిచ్చింది.  ఒకానొకదశలో సెన్సెక్స్‌ సూచీ 761 పాయింట్ల లాభపడి 35,811 వద్ద, నిఫ్టీ సూచీ 200 పాయింట్ల లాభపడి 10,752.20ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకాయి. మార్కెట్ చివరి 15నిమిషాల్లో స్వల్ప అమ్మకాలు జరగడంతో నిఫ్టీ 10737 వద్ద, సెన్సెక్స్‌ 35779 వద్ద ముగిశాయి.
యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటర్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, భారతీఎయిర్టెల్‌ షేర్లు 5నుంచి 7శాతం లాభపడగా, టైటాన్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 4.50శాతం నష్టపోయాయి.



You may be interested

అలాగైతే సెన్సెక్స్‌@ 47,000!

Wednesday 12th December 2018

సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే కీలకం మోర్గాన్‌స్టాన్లీ అంచనా సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వస్తే వచ్చే ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ 47వేల పాయింట్లను తాకుతుందని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతానికి మార్కెట్లో సెంటిమెంట్‌ నిరుత్సాహంగా ఉందని తెలిపింది. వాల్యూషన్లు పర్వాలేదని, స్వల్పకాలంలో స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎర్నింగ్స్‌ మెరుగుపడడం లేదా పతనమవడం సంభవిస్తుందని తెలిపింది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన తీర్పు రాకుండా అతుకుల బొంత ప్రభుత్వం

ఈ స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌ సిగ్నల్స్‌

Wednesday 12th December 2018

మార్కెట్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. మంగళవారం ముగింపు ప్రకారం 38 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా మారిన కంపెనీల్లో యస్‌బ్యాంక్‌, బయోకాన్‌, ఇండియన్‌ బ్యాంక్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎన్‌ఐఐటీ టెక్‌, ఫోర్టిస్‌ హెల్త్‌, నెల్కో, సుందరం ఫైనాన్స్‌, బోష్‌, టీటీకే

Most from this category