STOCKS

News


సెన్సెక్స్‌ 623 పాయింట్లు జంప్‌

Friday 24th May 2019
Markets_main1558694739.png-25921

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారం చేపట్టడంతో జూన్‌ తొలివారంలో జరిగే రిజర్వుబ్యాంక్‌ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలకు అనుగుణంగా సూచీలు శుక్రవారం భారీ లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 623 పాయింట్లు పెరిగి 39,434.72 వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,844.10 వద్ద స్థిరపడింది. అన్ని రంగాల్లో చెప్పుకోదగిన కొనుగోళ్లతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఆయా ఆయా రంగాల షేర్ల ర్యాలీ కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడం, రూపాయి బలపడటం తదితర కారణాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. మే 31న వెలువడనున్న జీడీపీ గణాంకాల ప్రకారం వృద్ధిరేటు తగ్గవచ్చని, దాంతో జూన్‌ 3-6 తేదీల మధ్య జరిగే ఆర్‌బీఐ సమీక్షలో రేట్ల తగ్గింపునకు మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు మార్కెట్లో తాజాగా మొదలయ్యాయి. అలాగే ఎన్‌డీఏ-2 ప్రభుత్వం చేపట్టనున్న సంస్కరణల ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ కీలక రేట్లు 2 శాతం వరకూ తగ్గే అవకాశం వుందని, అలాగే ఆర్‌బీఐ మార్కెట్లోకి మరింత లిక్విడిటీని ప్రవేశపెట్టవచ్చన్న అంచనాలు సైతం మారె​‍్కట్‌ ర్యాలీకి పురికొల్పాయి.

లాభాల ప్రారంభం...

  సెన్సెక్స్‌ 265 పాయింట్ల లాభంతో 39,075 వద్ద నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,750 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేంద్రం సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థలో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టవచ్చనే అంచనాలతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడ్డారు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 666 పాయింట్లు లాభపడి 39,477 వద్ద, నిఫ్టీ 202 పాయింట్ల పెరిగి 11,859 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌, రియల్టీ, ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.  ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 803 పాయింట్లు లాభపడి 31,212.55 వద్ద స్థిరపడింది. చిన్న, మధ్య స్థాయి రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతో బీస్‌ఈలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2శాతం, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.50శాతం పెరిగాయి. 

జీ లిమిటెడ్‌, భారతీఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 4శాతం నుంచి 5.50శాతం లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. 



You may be interested

ఏ రంగానికి మోదం!

Saturday 25th May 2019

ప్రస్తుత ఎన్‌డీయే సర్కారుకే మరింత మెజారిటీతో దేశ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టడం చూశాం. దీంతో విధానాల్లో స్పష్టత, సుస్థిరతకు అవకాశం ఇచ్చినట్టు అయింది. మార్కెట్లకు రాజకీయ పరంగా అస్థిరతకు బ్రేక్‌ పడింది. అయితే, రాజకీయ స్థిరత్వం ఒక్కటే ఈక్విటీ మార్కెట్లు, లేదా కరెన్సీ మార్కెట్‌ను ముందుకు నడిపించే పరిస్థితి లేదు. దేశీయ వినియోగం చల్లబడడం, చమురు ధరలు, వాణిజ్య యుద్ధం వంటి ఇతరత్రా అంశాలు కూడా ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌

నిపుణులు మెచ్చిన 9 స్టాక్స్‌!

Friday 24th May 2019

కొత్త ప్రభుత్వ హయంలో పీఎస్‌బీ, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్‌, రోడ్డు మరియు నిర్మాణ రంగాలు మంచి జోరు చూపుతాయని ఎకనమిక్‌ టైమ్స్‌ నిపుణుల బృందం అభిప్రాయపడింది. కీలకమైన ఈ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెడుతుందని తెలిపింది. ఎఫ్‌ఎంసీజీల్లో గ్రామీణ వినిమయంపై ఫోకస్‌ పెట్టిన కంపెనీలకు మరింత లబ్ది ఉంటుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం 30వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి పచ్చజండా ఊపింది. 2014తో పోలిస్తే ఇది దాదాపు

Most from this category