News


సెన్సెక్స్‌ 550 పాయింట్లు జంప్‌

Wednesday 31st October 2018
Markets_main1540982179.png-21618

మిడ్‌సెషన్‌ నుంచి జోరందుకున్న కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 551 పాయింట్ల పెరిగి 34,442 వద్ద, నిఫ్టీ 188 లాభంతో 10,386 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 345.50 పాయింట్లు పెరిగి 25వేల పైన 25,153 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ సంక్షోభ సెగలతో మార్కెట్‌లో మిడ్‌సెషన్‌ వరకు తీవ్ర ఒడిదుడుకులను లోనైంది. తొలుత ఆర్‌బీఐ సంక్షోభ సెగలతో మిడ్‌సెషన్‌ సెషన్‌ వరకు నష్టాల బాట పట్టాయి. ఆర్‌బీఐ స్వతంత్ర్వ ప్రతిపత్తిని గౌరవిస్తామని మిడ్‌సెషన్‌ సమయంలో కేంద్రం ప్రకటించడం, ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అందిన సానుకూలాంశాలతో సూచీలు చెలరేగిపోయాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌, ఆర్థిక షేర్ల ర్యాలీ మార్కెట్‌ను ముందుండి నడిపించింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క మెటల్‌ సూచీ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే ముగిశాయి. అత్యధికంగా ఐటీ ఇండెక్స్‌ 4శాతం లాభపడింది. మిడ్‌సెషన్‌ నుంచి ట్రేడింగ్‌ చివరి వరకు సాగిన కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 572 పాయింట్ల పెరిగి 34,463.38 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు లాభపడి 10,396 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.
స్వల్పలాభాలతో ప్రారంభం:-
ప్రపంచ మార్కెట్లు పటిష్టంగా వున్నప్పటికీ, భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభంతో ట్రేడ్‌ అయింది. ప్రభుత్వానికి, ఆర్బీఐకి మ‌ధ్య గొడ‌వ‌లు తార‌స్థాయికి చేర‌డం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌ సూచీ 71 పాయింట్ల లాభంతో 33,963 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల 10,209 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 
మార్కెట్‌ ఆర్‌బీఐ సంక్షోభ సెగలు:-
ఆర్బీఐ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేస్తారన్న వార్తలు మార్కెట్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే  వెలుగులోకి వచ్చాయి. మరోవైపు డాలర్‌ మారకంలో రూపాయి విలువ 74.13 వద్దకు దిగిరావడం కూడా ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. సజావుగా లాభాల్లో సాగుతున్న సూచీలకు హఠాత్తుగా ఆర్‌బీఐ సంక్షోభ సెగలు తగలడంతో ఒక్కసారిగా నష్టాల్లోకి మళ్లాయి. నిఫ్టీ సూచి 93 పాయింట్లు నష్టపోయి 10,105 వద్ద, సెన్సెక్స్‌ 304 పాయింట్లను కోల్పోయి  33,963.09 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

మళ్లీ లాభాల్లో మార్కెట్‌:-
రూపీ పతనంలో ఐటీ, ఫార్మా షేర్ల లాభాల ట్రేడింగ్‌తో పాటు, ఆర్‌బీఐ స్వతంత్ర్వ ప్రతిపత్తిని గౌరవిస్తామని కేంద్రం ప్రకటించడంతో మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ లాభాల బాట పట్టింది. మరోవైపు యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు లాభాల ప్రారంభం, ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానిచ్చింది. చివరి గంటలో కొనుగోళ్లు మరింత పెరగడంతో సూచీలు ఒకానొక దశలో సెన్సెక్స్‌ 572 పాయింట్ల పెరిగి 34,463.38 వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు లాభపడి 10,396 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. చివరకు నిఫ్టీ 10,387 వద్ద, సెన్సెక్స్‌ 34,442ల వద్ద ముగిశాయి.
మారుతి, హిందాల్కో, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, యూపీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్‌ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 5.50శాతం నుంచి 8.50శాతం లాభపడ్డాయి. You may be interested

ఈ ఐదు షేర్లంటే అనలిస్టులకు మహా ఇష్టం

Wednesday 31st October 2018

పలు బ్రోకింగ్‌ సంస్థలు, మార్కెట్‌ విశ్లేషకులు సూచించిన 185 షేర్లలో ఒక ఐదు షేర్లు మాత్రం కామన్‌గా నిలుస్తున్నాయి. ప్రముఖ 10 మంది విశ్లేషకులు, సంస్థలు సూచించిన జాబితాలో ఈ 5 షేర్లకు స్థానం కొనసాగుతూనే ఉంటుంది. కేవలం సిఫార్సు మాత్రమే కాకుండా, కనీసం 39 శాతానికి తగ్గకుండా ఈ షేర్ల ద్వారా రాబడిని పొందవచ్చని వీరు అందరు కామన్‌గా సూచించడం మరోవిశేషం. ఇంతకీ అవేంటంటే..  కంపెనీ పేరు మొత్తం రెకమండేషన్లు బై రేటింగ్స్‌ రాబడి అంచనా

ఐటీ రంగంలో ఈ షేర్లు భేష్‌..!

Wednesday 31st October 2018

టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, ఎన్‌ఐఐటీ షేర్లను కొనొచ్చు.. ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచన ముంబై: మిడ్‌క్యాప్‌ ఐటీ రంగ షేర్లలో ఎన్‌ఐఐటీ మినహాయించి మిగిలిన అన్ని షేర్లు ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వీటి జోలికి వెళ్లడం కంటే ఎంపిక చేసిన టాప్‌ ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేష్‌ జోషి సూచించారు. ఈ

Most from this category