STOCKS

News


10900పైన నిఫ్టీ ముగింపు

Thursday 17th January 2019
Markets_main1547720194.png-23642

  • మూడోరోజూ లాభాలే
  • ఆదుకున్న హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ

ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు స్వల్ప లాభంతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభపడి 36,374 వద్ద, ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 10,905 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడో రోజూ లాభాల ముగింపు కావడం విశేషం.  యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 27500లపై ముగిసింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఐటీ షేర్లకు కలిసిరాగా, హెచ్‌డీఎఫ్‌సీ ర్యాలీతో ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న సూచీలు నేడు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 92 పాయింట్ల పెరుగుదలతో 36,413 వద్ద నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో  10,920 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. ఇంట్రాడేలో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, యస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడితో సూచీలు ఆరంభంలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. దీనికి తోడు అంతర్జాతీయ బలహీన పరిస్థితుల సెంటిమెంట్‌ మార్కెట్లో మరింత అమ్మకాలను పెంచింది. ఈ క్రమంలో సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి కల్లా ఒకానొక దశలో సెన్సెక్స్‌ 150 పాయింట్లను కోల్పోయి 36,171 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 10844ల వద్ద ఇంట్రాడే కనిష్టాలకు పతనమైంది. అయితే చివరి గంటలో జరిగి షార్ట్‌ కవరింగ్‌ సూచీలను నష్టాల ఊబి నుంచి బయట పడేశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌ ద్వయం, ప్రైవేట్‌ రంగ బ్యాంకులైన యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐటీ రంగానికి చెందిన టీసీఎస్‌ షేరు ర్యాలీ సూచీలను తిరిగి లాభాల్లోకి తెచ్చాయి. అలాగే రియల్టీ, ప్రైవేట్‌ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో ముగిశాయి. మరోవైపు ప్రభుత్వ రంగ బ్యాంక్‌, ఫార్మా రంగాలకు చెందిన ఇండెక్స్‌లు 1.50శాతం నష్టంతో ముగిశాయి. నేడు హెచ్‌యూఎల్‌ ఫలితాల నేపథ్యంలో ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయిగా, మెటల్‌ ఇండెక్స్‌ సైతం అరశాతం క్షీణించింది.
హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.  ఎస్‌బీఐ, ఐషర్‌మోటర్స్‌, జీలిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా షేర్లు 6.50శాతం క్షీణించాయి.



You may be interested

డెరివేటివ్స్‌ మార్జిన్లు పెంచిన ఎన్‌ఎస్‌ఈ

Thursday 17th January 2019

బడ్జెట్‌ సెషన్‌ సమయంలో తీవ్ర ఒడిదుడుకులను తట్టుకునేందుకు ఎఫ్‌అండ్‌ఓ విభాగంలో మార్జిన్లను పెంచుతున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. పార్లమెంట్‌లో బడ్జెట్‌ సెషన్‌ జరిగే వేళ డెరివేటివ్స్‌లో తీవ్ర కదలికలుంటాయని, వీటిని కట్టడి చేసేందుకు మార్జిన్లను దాదాపు 40 శాతం మేర పెంచుతున్నామని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. వచ్చే సోమవారం(జనవరి 21)నుంచి కొత్త మార్జిన్లు అమల్లోకి వస్తాయి. నిజానికి ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ స్వల్పకాలిక సరాసరి 16 వద్దే ఉంది. అంటే మార్కెట్లో పెద్దగా

ఈ పీఎస్‌యూ షేర్లు ఆకర్షణీయం!

Thursday 17th January 2019

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు దేశీయ మార్కెట్లో కొన్ని ఎంపిక చేసిన పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన రిస్కురివార్డును ఆఫర్‌ చేస్తున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. పలు పీఎస్‌యూ షేర్లు వాటి ఆల్‌టైమ్‌ లో వద్ద ట్రేడవుతున్నాయని తెలిపింది. ఈ రేటు వద్ద వాటి పీఈలు చాల తక్కువగా ఉన్నాయని, అందువల్ల రివార్డు బాగుంటుందని వివరించింది. నిఫ్టీతో పోలిస్తే ఈ పీఎస్‌యూల వాల్యూషన్లు దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నాయని

Most from this category