STOCKS

News


మార్కెట్‌ మరో హైజంప్‌

Tuesday 12th March 2019
Markets_main1552386818.png-24563

  • 481 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌
  • 11300పైన ముగిసిన నిఫ్టీ 

అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు రెండోరోజూ చెలరేగిపోయాయి. ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర అంశాలు సూచీల ర్యాలీకి అండగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 37,535 వద్ద, నిఫ్టీ 133 పెరిగి 11,301 వద్ద స్థిరపడ్డాయి. 5నెలల తరువాత రెండురోజుల్లో అధికంగా జరిగిన ర్యాలీ ఇదేనని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎస్‌లోని బ్యాంక్‌ నిఫ్టీ ఇంట్రాడేలో 522 పాయింట్లు పెరిగి 28,488.10 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ బ్యాంక్‌ నిఫ్టీ రికార్డుస్థాయిలో పెరిగేందుకు తోడ్పాటును అందించింది. చివరికి 477 పాయింట్లు లాభంతో 28,404 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, దేశీయ ఇన్వెస్టర్‌ల నుంచి లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరమైన ర్యాలీ చేశాయి. అత్యధికంగా లార్జ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటి మినహా అన్ని రంగాల షేర్లుకు కొనుగోళ్లు మద్దతు లభించింది. అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. అయితే రూపాయి బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. వాటితో పాటు ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో సైతం స్వల్పంగా అమ్మకాలు జరిగాయి. సెన్సెక్స్‌ 532 పాయింట్లు లాభపడి 37,586.63 వద్ద, నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 11,320.40 వద్ద  ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. 
అదానీ పోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 3శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. అలాగే జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్ఫ్రాటెల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.



You may be interested

ఇండెక్స్‌ ర్యాలీలో ఏయే షేర్ల వాటా ఎంత..?

Tuesday 12th March 2019

అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీతో పాటు ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల వాతవరణం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం తదితర కారణాలతో సూచీలు రెండో రోజూ  లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 481 పాయింట్లు లాభపడి 37,535 వద్ద, నిఫ్టీ 133 పెరిగి 11,301 వద్ద స్థిరపడ్డాయి. -    నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 152 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 22 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 22 పాయింట్లును, ఐసీఐసీఐ బ్యాంక్‌ 20 పాయిం‍ట్లను,

నిఫ్టీ ఐటీలో వీక్లీ ఆప్షన్స్‌ షురూ!

Tuesday 12th March 2019

నిఫ్టీ ఐటీ సూచీలో వీక్లీ ఆప్షన్స్‌ను ప్రవేశపెడుతున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ ప్రకటించింది. ప్రస్తుతం నిఫ్టీ ఐటీలో మూడు నెలల ఎక్స్‌పైరీ సైకిల్‌తో నెలవారీ ఆప్షన్లున్నాయి. ఇకపై ఇదే మూడునెలల ఎక్స్‌పైరీ సైకిల్‌తో వారం వారీ ఆప్షన్లను ఎన్‌ఎస్‌ఈ ప్రవేశపెట్టింది. వీటితో ఫ్లెక్సిబిలిటీ మరింత పెరుగుతుందని, వివిధ ట్రేడింగ్‌ వ్యూహాలు అవలంబించే వీలు చిక్కుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ కదలికలను బట్టి పొజిషన్లను మరింత సమర్ధవంతంగా హెడ్జ్‌ చేసుకోవచ్చంటున్నారు. నెలవారీ

Most from this category