News


10700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 28th January 2019
Markets_main1548671346.png-23851

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సోమవారం మార్కెట్‌ భారీ నష్టంతో ముగిసింది. నిఫ్టీ 10700 మార్కును కోల్పోగా, సెన్సెక్స్‌ 35700  పాయింట్ల స్థాయిని వదులుకుంది. ఐటీ, మీడియా రంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 369 పాయింట్ల కోల్పోయి 35,656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల నష్టపోయి 10,661.55 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనం కారణంగా బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ 462 పాయింట్ల నష్టపోయి 26,653 వద్ద క్లోజయ్యింది. ఈ వారం బీఎస్‌ఈలో 500లకు పైగా, ఎన్‌ఎస్‌ఈలో 16 కంపెనీలు మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండంతో పాటు, మరో 4రోజుల్లో జనవరి ఫ్యూచర్‌ కాంట్రాక్టు గడువు ముగియనుండటం, ఈ శుక్రవారం ఎన్‌డీఏ సర్కార్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు మొదలవడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.  అమ్మకాలు క్రమక్రమంగా పెరగడంతో సూచీలు నష్టాలకే పరిమితయ్యాయి. ఒక్క మీడియా, ఐటీ రంగ షేర్లలో తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 460 పాయింట్లు నష్టపోయి 35,565.15 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లను కోల్పోయి 10,631ల వద్ద  కనిష్టాలను నమోదు చేసాయి.
బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, అదానీపోర్ట్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 12.50శాతం నష్టపోగా, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, ఇన్ఫ్రాటెల్‌, జీలిమిటెడ్‌ షేర్లు 2నుంచి 16శాతం లాభపడ్డాయి.

కోలుకున్న జీ, డిష్‌ టీవీ:-
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని గత శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసిన ఎస్సాల్‌ గ్రూప్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో మిశ్రమంగా ట్రేడయ్యాయి. జీ ఎంటర్‌‍ప్రైజెస్‌, డిష్‌ టీవీలు రికవరీ కాగా, జీ మీడియా షేరు మాత్రం నష్టాల్లోనే ట్రేడైంది. కంపెనీ రుణదాతలతో షేర్ల తనఖా ఒప్పందం కుదుర్చుకోవడం,  షేర్ల విక్రయించకుండా తమ వద్దే పెట్టుకోవడానికి దాదాపు 97 శాతం రుణదాతలు అంగీకరించడం, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్ చంద్ర వాటా విక్రయానికి రుణదాతలు మూడునెలల గడువ్వడం తదితర కారణాలతో జీ ఎంటర్‌‍ప్రైజెస్‌, డిష్‌ టీవీ లాభాలతో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 16శాతం లాభపడి రూ.రూ.368.50ల వద్ద, డిష్‌టీవి 8 శాతం లాభపడి రూ.24ల వద్ద ముగిశాయి. అయితే జీ మీడియా షేరు మాత్రం 19.50శాతం నష్టంతో రూ.17.80 వద్ద ముగిసింది.You may be interested

ఆగని గ్రాఫైట్‌ షేర్ల పతనం

Monday 28th January 2019

గ్రాఫైట్‌ షేర్లలో పతనం ఆగడం లేదు. చైనా నుంచి దిగుమతయ్యే గ్రాఫైట్‌ ఎలక్ట్రోడ్స్‌పై 2018 సెప్టెంబర్‌లో యాంటీ డంపింగ్‌ డ్యూటీ ఎత్తివేయడంతో పాటు స్టీల్‌ ధరల్లో తగ్గుదల కారణంగా గ్రాఫైట్‌ వినియోగం తగ్గుతుందన్న అంచనాలతో  గ్రాఫైట్‌ షేర్లు తీవ్రఅమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఈ రంగానికి చెందిన గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ లిమిటెడ్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో తాజాగా 52వారాల కనిష్టానికి పడిపోయాయి. గ్రాఫైట్‌ ఇండియా నేటి ట్రేడింగ్‌లో 15శాతం పతమైన చివరికి 9.30శాతం

కలిసిరాని ఫలితాలు...కెనరా బ్యాంక్‌ 5 శాతం డౌన్‌

Monday 28th January 2019

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అధిక వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) అండతో పాటు మెరుగైన ఆస్తుల నిర్వహణ కారణంగా ఈ క్యూ3లో బ్యాంక్‌ ఏకంగా నికరలాభాన్ని 152శాతం పెంచుకుంది. గతేడాది ఇదే క్యూ3లో నికరలాభం రూ.125 కోట్లను నమోదు చేయగా, ఈ క్యూ3లో రూ.317.52 కోట్లను సాధించింది. నికర వడ్డీ ఆదాయం రూ.3184 కోట్లుగా నమోదైంది. గతేడాది

Most from this category