STOCKS

News


7నెలల కనిష్టానికి నిఫ్టీ

Friday 26th October 2018
Markets_main1540549675.png-21499

ప్రపంచమార్కెట్లో అస్థిరత భారత్‌ మార్కెట్‌ను మరోసారి దెబ్బతీసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగివచ్చినప్పటికీ, దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి రీకవర అయినప్పటీకీ మార్కెట్‌ కోలుకోలేకపోయింది.  ఆసియా నుంచి యూరప్‌తో పాటు అమెరికా మార్కెట్‌ ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌తో కారణంగా దేశీయ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాలతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్‌ సూచీ 341 పాయింట్లు నష్టపోయి 33,349 వద్ద, నిప్టీ సూచీ 95 పాయింట్ల కోల్పోయి 10,030 వద్ద ముగిశాయి. నిఫ్టీ సూచీకి ఇది 7నెలల కనిష్టస్థాయి.  వారం వారీగా చూస్తే సెన్సెక్స్‌ సూచీ 2.82 శాతం, నిప్టీ 2.65శాతం నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 396.40పాయింట్లు నష్టపోయి 24,421 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. యస్‌ బ్యాంక్‌ భారీ పతనం కారణంగా అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ సూచీ 2శాతం నష్టపోయింది.

క్షణాల్లో నష్టాల్లోకి సూచీలు:-
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్‌ మళ్లీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ గత ముగింపు 33,690 పోలిస్తే 87 పాయింట్లు నష్టంతో 33,777 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన గత ముగిపంపు 10,123 పాయింట్లతో  పోలిస్తే 1 పాయింట్‌ లాభంతో  10,122 ప్రారంభమైంది. యస్‌ బ్యాంక్‌, ఫైనాన్స్‌ కంపెనీ షేర్లు, ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ షేర్లు నష్టాల ఓపెనింగ్‌ కారణంగా మార్కెట్‌ క్షణాల్లో భారీగా కుప్పకూలింది. ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటలోనే ప్రధాన సూచీలు నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 10004 వద్ద, సెన్సెక్స్‌ 399 పాయింట్లు నష్టపోయి 33,291.58 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. బాగా పతనమైన షేర్లలో అటుతర్వాత షార్ట్‌ కవరింగ్‌ కారణంగా సూచీలు రికవరీ బాట పట్టాయి. అందుకు అటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు కారణమయ్యాయి. అయితే ఐటీ, బ్యాకింగ్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ను మళ్లీ నష్టాలు వెంటాడాయి.
ప్రపంచమార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు:-
ప్రపంచమార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలే నేటి మార్కెట్‌ ట్రేడింగ్‌ను దెబ్బతీశాయని చెప్పవవచ్చు. మార్కెట్‌  మిడ్‌ సెషన్‌ సమయానికి అటో, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్ల రీకవరీతో ఆరంభనష్టాలను పరిమితం చేసుకుంది. ఈ దశలో అటు ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, ఇటు యూరప్‌ మార్కెట్ల 1.50 శాతం నుంచి 2శాతం నష్టాల ఓపెనింగ్‌, మరోవైపు అమెరికా ఫ్యూచర్లు 1శాతం నష్టాల ట్రేడింగ్‌ కారణంగా మన దేశీయ మార్కెట్‌ ఇన్వెస్టర్ల స్థైర్యం దెబ్బతింది.  ఇంట్రాడేలో కంపెనీల క్యూ2 ఫలితాలను ప్రకటన కూడా ట్రేడింగ్‌పై ప్రభాన్ని చూపాయి. ఐటీసీ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసినప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు ఇంట్రాడేలో 4శాతం నష్టపోయింది. నేడు నిఫ్టీ సూచీ కోల్పోయిన మొత్తం పాయింట్లలో ఒక్క ఐటీసీ షేరువే 20 పాయింట్లు కావడం గమనార్హం. ఈ ప్రతికూల పరిస్థితులకు ట్రేడింగ్‌ చివరి గంటలో అమ్మకాలు జత కలవడంతో  సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
గ్రాసీం, హెచ్‌సీఎల్‌టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 8.50శాతం నష్టపోగా, బీపీసీఎల్‌, టాటామోటర్స్‌, బజాజ్‌-అటో, టైటాన్‌, యూపీఎల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ట్రేడర్లు బేరిష్‌..ఇండెక్స్‌ ఫ్యూచర్ల ప్రీమియం కట్‌

Friday 26th October 2018

సమీపరోజుల్లో మార్కెట్‌ మరింత క్షీణిస్తుందన్న ట్రేడర్ల అంచనాల కారణంగా ఇండెక్స్‌ ఫ్యూచర్లలో చాలావరకూ ప్రీమియం శుక్రవారం హరించుకుపోయింది. అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ ప్రారంభపు రోజునాడే ప్రీమియం కట్‌కావడం టెక్నికల్‌గా బేరిష్‌ సంకేతం. సెప్టెంబర్‌ సిరీస్‌లో 7 శాతంపైగా పతనం చూసిన నిఫ్టీ అక్టోబర్‌ సిరీస్‌ తొలినాళ్లలో కొంత రికవరీ వుంటుందన్న అంచనాలతో గురువారం నిఫ్టీ ఫ్యూచర్‌...స్పాట్‌తో పోలిస్తే  60 పాయింట్ల ప్రీమియంతో ముగిసింది. శుక్రవారం స్పాట్‌ నిఫ్టీ 95 పాయింట్ల క్షీణతతో

ఐటీసీ నికరలాభం 12 శాతం అప్‌

Friday 26th October 2018

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 12 శాతం పెరిగి రూ. 2,950 కోట్లకు చేరింది. ఆదాయం 7.3 శాతం వృద్ధితో రూ. 11,069 కోట్లకు పెరిగింది. కంపెనీ సిగరెట్ల ఆదాయం 10 శాతంపైగా పెరిగి రూ. 5,060 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ వ్యాపారం ద్వారా 45 శాతం సమకూరింది. సిగరెట్ల మీద ఇబిటా 8.3 శాతం వృద్ధిచెందిందని, అయితే మార్జిన్లు అంతక్రితం

Most from this category