STOCKS

News


ఆగని పరుగు...మూడో రోజూ లాభాల ముగింపు

Wednesday 13th March 2019
Markets_main1552473575.png-24589

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీతో బుధవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 216 పాయింట్లు పెరిగి 37752 వద్ద,  నిఫ్టీ 40 పాయింట్ల లాభపడి 11341.70 వద్ద స్థిరపడ్డాయి.  ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్‌ 1080 పాయింట్లను, నిఫ్టీ 306 పాయింట్లను ఆర్జించాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ నేటి ట్రేడింగ్‌ 28,928 వద్ద కొత్త రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1.50శాతం(440 పాయింట్లు) లాభంతో 28,884.30 వద్ద స్థిరపడింది. నిన్న మార్కెట్‌ ముగిసిన తరువాత వెలువడిన జనవరి పారిశ్రామిక, ఫిబ్రవరి రిటైల్‌ ధరల గణాంకాలు మార్కెట్‌ అశించిన స్థాయిలో నమోదు కావడం సెంటిమెంట్‌ను బలపరిచింది. బ్రెగ్జిట్‌ అంశం ఆందోళన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న సూచీలు ఉదయం కొంత నష్టాలను చవిచూసాయి. అయితే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపడంతో సూచీలు తిరిగి ర్యాలీ ప్రారంభించాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ లాంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లు ర్యాలీ సూచీలకు భారీ లాభాల్ని ఆర్జించాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 51 పాయింట్లను ఆర్జించి 11,352.30 వద్ద, సెన్సెక్స్‌  262 పాయింట్ల పెరిగి 37,797 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. 
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం లాభపడగా, వేదాంత, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్‌, ఐఓసీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. 



You may be interested

ఫండ్‌ మేనేజర్స్‌ షాపింగ్‌

Thursday 14th March 2019

దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.565 కోట్ల విలువచేసే షేర్లను విక్రయించాయి. గత నెల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోళ్లు చేస్తుంటే, దేశీయ ఇనిస్టిట్యూషన్లు అమ్మకాలు చేస్తున్నాయి. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గింది కూడా. సాధారణ ఎన్నికల ముందు మార్కెట్ల ప్రతికూల పనితీరు ప్రభావం నిధుల రాకపై పడింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.23.4 లక్షల కోట్లకు

సరికొత్త బుల్‌దశలోకి మార్కెట్‌

Wednesday 13th March 2019

ఎలారా క్యాపిటల్‌ అంచనా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నెలకొన్న అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. మార్కెట్లు గతేడాది జనవరి తర్వాత తిరిగి ఇప్పుడు కొత్త బుల్‌ఫేజ్‌లోకి ఎంటరవుతున్నాయని, ఈ దశలో దాదాపు 40 శాతం వరకు ర్యాలీ ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా, స్థానికంగా మార్కెట్లు జోరు కొనసాగిస్తాయని అంచనా వేసింది. ప్రస్తుత అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందనేందుకు కచ్ఛితమైన కారణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ దశలో దీర్ఘకాలిక పెట్టుబడులతో మార్కెట్లోకి ఎంటర్‌ కావచ్చని

Most from this category