STOCKS

News


10,200 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 24th October 2018
Markets_main1540377103.png-21451

  • దిగివచ్చిన చమురు ధరలు
  • నాలుగురోజుల నష్టాలకు బ్రేక్‌

ముంబై:- ముడి చమురు ధరలు దిగిరావడంతో మార్కెట్‌ నాలుగురోజుల వరుస నష్టాలకు బుధవారం బ్రేక్‌ పడింది. చివరి గంటలో మెటల్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్‌ తిరిగి 34000 వేల మార్కును నిఫ్టీ 10200 మార్కును అందుకున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలపడం కూడా సూచీల ర్యాలీకి మరో కారణమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 187 పాయింట్లు లాభపడి 34034 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 10,225 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 25వేల ఎగువున 25,064 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఒక్క ఫార్మా ఇండెక్స్‌ తప్ప మిగితా అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది.
భారీ గ్యాప్‌తో ఓపెనింగ్‌:-
ప్రపంచమార్కెట్లలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ.., దేశీయ మార్కెట్‌ బుధవారం భారీ గ్యాప్‌తో ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 356 పాయింట్ల లాభంతో 34వేల ఎగువన 34,203 వద్ద, నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో 10, 278 వద్ద ప్రారంభమయ్యాయి.  ఆర్థిక, ఇంధన, లోహ, ఔషధ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఓ దశలో సెన్సెక్స్‌ 454 పాయింట్ల లాభపడి 34, 301 వద్ద, నిఫ్టీ 144  పాయింట్ల పెరిగి 10,291 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.
34వేల దిగువకు సెన్సెక్స్‌:-
భారీ గ్యాప్‌తో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు ఆరంభ లాభాలను ఎక్కువసేపు నిలుపుకోలేకపోయాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలపడం కారణంగా ఫార్మా, ఐటీ షేర్లు వెనకడుగు వేశాయి. అత్యధిక ఫార్మా షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. రేపు (గురువారం) అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు ముగియనుండటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతుండటం కూడా మరో కారణమైంది. ఫలితంగా  సెన్సెక్స్‌ 34 వేల మార్కును, నిఫ్టీ 10150 మార్కును కోల్పోయాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 121 పాయింట్లను కోల్పోయి 33,847 వద్ద, నిఫ్టీ సూచీ 22 పాయింట్లు నష్టపోయి 10,122 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
మళ్లీ లాభాల్లోకి మార్కెట్‌:-
అయితే చివరి గంటలో మార్కెట్లో  భారీ ఎత్తున కొనుగోళ్ల పర్వం జరిగింది. అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. చివరకు సెన్సెక్స్‌ 34034 వద్ద, నిఫ్టీ 10,225ల వద్ద ముగిసింది.
అదానీ పోర్ట్స్‌, గ్రాసీం, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2నుంచి 4.50శాతం నష్టపోగా, హిందాల్కో, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, బజాజ్‌ఫైనాన్స్‌ షేర్లు 5నుంచి 12శాతం లాభపడ్డాయి.



You may be interested

హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు దూరం!

Wednesday 24th October 2018

దేశీయ మార్కెట్లో ఇప్పటివరకు దుమ్మురేపిన కొన్ని రంగాలు ఇకపై చతికిలపడతాయని, ఇదే సమయంలో ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉన్న రంగాలు జోరు పెంచుతాయని యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ లలిత్‌ నంబియార్‌ అభిప్రాయపడ్డారు. హౌసింగ్‌, కన్జూమర్‌ ఫైనాన్స్‌ రంగాలు ఇకపై అంతంతమాత్రంగా ఉంటాయని, ఫార్మా రంగంలో దూకుడు కనిపించవచ్చని అంచనా వేశారు. మూలాలపై బలమైన నమ్మకం ఉన్న కంపెనీలను ఎంచుకున్నవాళ్లు కరెక‌్షన్‌కు భయపడాల్సిన పనిలేదన్నారు. కంపెనీలు చేసే వ్యాపార నాణ్యతపై విశ్వాసం,

భారతీ ఎయిర్‌టెల్‌ భారీ జంప్‌..

Wednesday 24th October 2018

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ బుధవారం ఏకంగా 9 శాతంమేర లాభపడింది. ఉదయం నుంచి సాధారణంగానే ట్రేడ్‌ అవుతూ వచ్చిన ఎయిర్‌టెల్‌.. చివరి అరగంటలో బాగా పెరిగింది. నిఫ్టీ-50లో టాప్‌-2 గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌ స్టాక్‌ చివరకు 10 శాతానికిపైగా పెరుగుదలతో రూ.315 వద్ద ముగిసింది. షేరు ధర ఇంట్రాడేలో ఒకానొక సమయంలో ఏకంగా 15 శాతంమేర పెరిగి రూ.328ని కూడా తాకింది. టాప్‌ గెయినర్‌గా బజాజ్‌ ఫైనాన్స్‌

Most from this category