STOCKS

News


మిడ్‌సెషన్‌ అ‍మ్మకాలు -నష్టాల ముగింపు

Friday 25th January 2019
Markets_main1548411280.png-23809

  • 10800 దిగువకు నిఫ్టీ

మిడ్‌సెషన్‌ అనంతరం జరిగిన అ‍మ్మకాలు మార్కెట్‌ను ముంచేశాయి. మారుతీ సుజుకీ, జీఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్,  ఐసీఐసీఐ, అల్ట్రాటెక్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీలు... ఈ వారంలో కనిష్టస్థాయి వద్ద ముగిసాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేర్ల క్షీణత కారణంగా నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది.  సెన్సెక్స్‌ 169.56 పాయింట్ల నష్టంతో 36, 025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 10,780 వద్ద స్థిరపడ్డాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐలు  2శాతం పతనం కావడంతో నిప్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 151పాయింట్లు నష్టపోయి 27,115 వద్ద ముగిసింది. నిఫ్టీ మీడియా ఇండెక్స్‌ 20శాతం నష్టపోయింది. డిష్‌టీవీ(37శాతం), జీలిమిటెడ్‌(31శాతం) షేర్ల భారీ పతనం ఇందుకు కారణమైంది. అలాగే మారుతి సుజుకీ(8శాతం), హీరో మోటర్‌ కార్ప్‌లిమిటెడ్‌(4శాతం), టాటామోటర్స్‌(5శాతం) షేర్ల క్షీణతతో నిఫ్టీ అటో ఇండెక్స్‌ 3.50 శాతానికి పైగా నష్టపోయింది. రియల్టీ ఇండెక్స్‌ సైతం 4.50శాతం నష్టపోయింది. మెటల్‌ ఇండెక్స్‌ 1శాతం, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ అరశాతం క్షీణించాయి. అయితే డాలర్‌ మారకంలో రూపాయి 11 పైసలు బలపడంతో ఐటీ ఇండెక్స్‌ మాత్రం ఒక శాతం లాభపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,953.15 - 36,474.48 పాయింట్ల రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,756.45 - 10,931.70 స్థాయిలో కదలాడింది.
నిఫ్టీ - 50 ఇండెక్స్‌లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, మారుతి సుజుకీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హీరోమోటోకార్ప్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 31శాతం నుంచి 4శాతం నష్టపోగా, భారతీఎయిర్‌టెల్‌, సిప్లా, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి.You may be interested

జీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం

Friday 25th January 2019

31శాతం క్షీణించిన జీ ఎంటర్‌టైన్‌మెంట్‌   38శాతం పతనమైన డిష్‌ టీవీ ఎస్సెల్‌ గ్రూప్‌నకు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, జీ మీడియా, డిష్‌ టీవీ షేర్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్‌ అయిన ఎస్సెల్‌ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు తాజాగా వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈ

ఇప్పుడే ఎందుకు కొనాలి?

Friday 25th January 2019

మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్న తరుణంలో చాలామంది ఇన్వెస్టర్లు పొజిషన్లు వదిలించుకునేందుకు తయారవుతున్నారు. కానీ నాణ్యమైన మేనేజ్‌మెంట్‌, బలమైన మూలాలు ఉన్న స్టాకులను కొనుగోలు చేయడానికి ఇదే మంచి తరుణమని ఆనంద్‌ రాఠీ బ్రోకింగ్‌ సంస్థ సలహా ఇస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన ప్రైవేట్‌ వినిమియం మరింత విస్తరిస్తుందని అంచనా వేసింది. వేతనాల్లో బలమైన వృద్ధి, చమురు ధరలు దిగిరావడం, ప్రభుత్వవ్యయం పెరగడంతో వినిమయం మరింత జోరు చూపుతుందని తెలిపింది.

Most from this category