STOCKS

News


కొత్త ఆర్థిక సంవత్సరంలో రికార్డులతో బోణి

Monday 1st April 2019
Markets_main1554115381.png-24908

11650పైన ముగిసిన నిఫ్టీ
ఇంట్రాడేలో కొత్త జీవితకాల గరిష్టానికి సెన్సెక్స్‌ 

స్టాక్‌ మార్కెట్‌ కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజున లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,115 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ 30,648.10 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, దేశీయా మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ, ఈ వారంలో జరిగే ఆర్‌బీఐ సమీక్షా సమావేశాల అనంతరం కీలక వడ్డీరేట్లపై పావు రేటు తగ్గింపు అంచనాలు, బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు నమోదు చేయడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వమే ఏర్పడుతుందనే అంచనాలు తదితర సానుకూలాంశాలు సూచీల ర్యాలీకి తోడ్పడ్డాయి. పలితంగా సెన్సెక్స్‌ 164 పాయింట్లు లాభపడి 38,837 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 11,655 వద్ద ముగిశాయి. మెటల్‌, ఐటీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల లాభపడగా, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లు నష్టాలతో ముగిశాయి. 
సగానికి తగ్గిన లాభాలు:-
సానుకూల సంకేతాలతో సెన్సెక్స్‌ 186 పాయింట్ల లాభంతో 38,858.88 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 11,665.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ పరిమాణాలతో పాటు దేశీయంగా నెల అంతర్జాతీయంగా కమోడిటీ ధరలు పెరగడంతో మెటల్‌ షేర్లు, వడ్డీరేట్ల కోత అంచనాలతో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు, మార్చి వాహన విక్రయ గణాంకాల విడుదల నేపథ్యంలో అటో షేర్లు, రూపాయి బలహీనతతో ఐటీ షేర్ల కొనుగోళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 442 పాయింట్లు లాభపడి 39,115 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 114 పాయింట్లు లాభపడి 11,738.10 వద్ద ఇంట్రాడే గరిష్టాలను తాకింది. గతేడాది ఆగస్టులో నెలకొల్పిన 11,760 పాయింట్ల రికార్డుస్థాయిని నిఫ్టీ చేరకమునుపే లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు తెరతీయడంతో   లాభాలు సగానికి పైగా హరించుకుపోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ గరిష్టస్థాయి 39,115 నుంచి 303 పాయింట్లను కోల్పోయి 38,809 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ గరిష్టస్థాయి 11,738.10 నుంచి 93 పాయింట్లు కోల్పోయి 11,644.75 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. 
మారుతి, విప్రో, భారతీఎయిర్టెల్‌, హిందాల్కో, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 7.50శాతం లాభపడగా, ఇండస్‌ఇండ్‌, ఐఓసీ, ఐషర్‌మోటర్స్‌, యూపీఎల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.

 



You may be interested

ఐపీవో మార్కెట్‌లో మళ్లీ అలజడి?

Monday 1st April 2019

ఐపీవో మార్కెట్‌కు 2018-19 విరామ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీవో ఇష్యూలు 14ని మించలేదు. అందులో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, రైట్స్‌ లిమిటెడ్‌ పేరున్న ఇష్యూలు. మిగిలినవన్నీ చిన్నవే. 2019-20 ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించాం. ఆర్‌వీఎన్‌ఎల్‌ రూపంలో తొలి ఇష్యూ ఆరంభమైంది. మార్కెట్లపై బుల్స్‌ పట్టు, సానుకూల పరిస్థితుల నేపథ్యంలో ఐపీవో మార్కెట్‌లో కళకళలు మళ్లీ ఆరంభం కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లే ప్రస్తుతం ఐపీవోలను

ఎల్‌అండ్‌టీ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ ధర ఓకేనా?!

Monday 1st April 2019

మైండ్‌ట్రీలో మెజార్టీ వాటా సొంతం చేసుకునేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ఓపెన్‌ఆఫర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కో షేరుకు రూ. 980 చొప్పున ఎల్‌అండ్‌టీ ఆఫర్‌ చేయనుంది. అయితే కొంతమంది రిటైల్‌ ఇన్వెస్టర్లు, కొందరు సంస్థాగత ఇన్వెస్టర్లు మాత్రం ఈ రేటుపై పెదవి విరుస్తున్నారు. ఎల్‌అండ్‌టీ తన ఆఫర్‌ను మరింత పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో షేరు ఒక్కింటికి రూ. 980 అంటే సరసమైన ధరేనని ఎక్కువమంది అనలిస్టులు

Most from this category