STOCKS

News


మార్కెట్‌ను గట్టిక్కించిన మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు

Friday 12th April 2019
Markets_main1555064406.png-25098

మిడ్‌సెషన్‌ నుంచి జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ శుక్రవారం లాభంతో ముగిసింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 38767 వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,643 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం లాభపడి 29,938 వద్ద స్థిరపడింది. ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 38,692 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 11,612 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ ఫలితాల వెల్లడితో పాటు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహించడంతో సూచీలు కొద్దిసేపట్లోనే నష్టాల్లోకి మళ్లాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌, మెటల్‌, ఇన్ఫ్రా, ఇంధన రంగాలకు చెందిన షేర్లులో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి నష్టాలను చవివచూస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 152 పాయింట్లు నష్టపోయి 38,555 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల నష్టపోయి 11,579 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. అయితే మిడ్‌సెషన్‌ అనంతరం ఇన్వెస్టర్లు అనూహ్యంగా కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు అధికంగా జరిగాయి. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ, మారుతి షేర్లు 3శాతం ర్యాలీ చేయడంతో పాటు ప్రైవేట్‌ రంగ షేర్లైన యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి తోడ్పాటును అందించాయి. అలాగే యూరప్‌ లాభాల ప్రారంభం మార్కెట్‌ సెంటిమెంట్‌కు దోహదపడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టస్థాయి(38,555) నుంచి 264 పాయింట్లు లాభపడి 38,819 వద్ద, నిఫ్టీ ఇంట్రాడే కనిష్టస్థాయి నుంచి 78 పాయింట్ల పెరిగి 11,657 వద్ద ఇంట్రాడే గరిష్టా‍లను నమోదు చేశాయి. అయితే చివరి అరగంటలో కొంత అమ్మకాలు జరగడంతో సెన్సెక్స్‌ 38767 వద్ద, నిఫ్టీ 11,643 వద్ద స్థిరపడ్డాయి. 
సిప్లా, జీ లిమిటెడ్‌, మారుతీ, గెయిల్‌, ఐటీసీ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం లాభపడగా, బజాజ్‌ఫైనాన్స్‌, టాటామోటర్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐఓసీ, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి.



You may be interested

బడా ఇన్వెస్టర్ల అమ్మకాలు, కొనుగోళ్లు...

Friday 12th April 2019

రిటైల్‌ ఇన్వె‍స్టర్లలో ఎక్కువ మంది అనుసరించే రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఆశిష్‌ కచోలియా, డాలీ ఖన్నా, అనిల్‌కుమార్‌ గోయల్‌ తమ పోర్ట్‌ఫోలియోలో మార్చి త్రైమాసికంలో పలు మార్పులు చేర్పులు చేసుకున్నారు. వీటిని ఓ సారి గమనిస్తే...   ఫస్ట్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌ అనే బీపీవో కంపెనీలో జున్‌జున్‌వాలా తన వాటాలను మార్చి త్రైమాసికంలో పెంచుకున్నారు. డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి కంపెనీలో 2.89 శాతం వాటాలు ఉండగా (జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖ పోర్ట్‌ఫోలియోను ఒక్కటిగానే

మార్చిలో ఎంఎఫ్‌ల అమ్మకాలు, కొనుగోళ్లు..

Friday 12th April 2019

ఫిబ్రవరిలో పేలవ నిధుల ప్రవాహం చవిచూసిన మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మార్చిలో మరలా సాధారణ స్థాయిలో నిధులు వచ్చాయి. ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి మార్చిలో రూ. 9014 కోట్ల నిధులు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయిలో ఎంఎఫ్‌ల్లోకి నిధులు రావడం ఇదే తొలిసారి. దీంతో పాటు ఈక్విటీ ఏయూఎంల్లో సైతం ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 10 శాతం పెరుగుదల కనిపించింది. మార్చిలో ఈక్విటీ ఏయూఎంల విలువ రూ. 9.76 లక్షల

Most from this category