STOCKS

News


10650 పైన నిఫ్టీ

Tuesday 27th November 2018
Markets_main1543314107.png-22419

  • రెండో రోజూ లాభాల ముగింపే
  • రాణించిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు

మిడ్‌సెషన్‌ నుంచి పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్లతో సూచీలు వరుసగా రెండో లాభపడ్డాయి. నిఫ్టీ 10650పైన, సెన్సెక్స్‌ 35500ల పైన ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు అంతంత మాత్రంగా ఉండటంతో మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరి గంటలో పెరిగిన కొనుగోళ్లతో సూచీలు మరిన్ని లాభాలను మూటకట్టుకున్నాయి. చివరకు సెన్సెక్స్‌ 159 పాయింట్లు లాభపడి 35,513 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 10,685 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా ఐటీ ఇండెక్స్‌ లాభపడగా, అదేబాటలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు పెరిగాయి. ఫార్మా, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 77పాయింట్ల లాభపడి 26,443 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
ఆసియా మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలతో మంగళవారం సూచీలు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 35,394 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ సూచీ 7పాయింట్ల స్వల్ప నష్టంతో 10,621.45 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిణామాలు అంతంతగా ఉండటంతో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కూడా ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. మెటల్‌, ఫార్మా షేర్లు పతనం సూచీల నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మెటల్‌ షేర్లు వరుసగా 5వ ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల బాట పట్టాయి. సన్‌ఫార్మా 8శాతం పతనం ఫార్మా రంగాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 191 పాయింట్లు నష్టపోయి 35,268 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 10,629 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. తొలి సెషన్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాట సూచీలు ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో మిడ్‌ సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసిరాగా, కేంద్రం బ్యాంకులకు రూ.42వేల మూలధన సాయం ప్రకటనతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ర్యాలీ చేశాయి. మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్లతో సూచీలు స్థిరమైన ర్యాలీని చేశాయి. చివరి గంటలో కొనుగోళ్ల ఉదృతి మరింత పెరగడంతో 200 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 65 పాయింట్లను సాధించింది. చివరకు సెన్సెక్స్‌ 35,513 వద్ద, నిఫ్టీ 10,685 వద్ద ముగిశాయి.
బీపీసీఎల్‌, టీసీఎస్‌, గెయిల్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ సేర్లు 2.50శాతం నుంచి 3శాతం లాభపడగా, విప్రో, భారతీఎయిర్టెల్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, హీరోమోటోకార్ప్‌ షేర్లు 2నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

75% వరకు రాబడికి 7 సిఫార్సులు

Tuesday 27th November 2018

వచ్చే 6-18 నెలల కాలంలో మంచి రాబడిని ఇవ్వగలిగిన 7 షేర్లను పలు ప్రముఖ బ్రోకింగ్‌ కంపెనీలు సిఫార్సుచేస్తున్నాయి. దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యంతో ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 75 శాతం వరకు రాబడిని పొందవచ్చని సూచిస్తున్నాయి.  ఆర్తి డ్రగ్స్ | బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠీ | రేటింగ్: కొనొచ్చు | టార్గెట్ ధర: రూ.745 | రాబడి అంచనా: 36 శాతం కంపెనీ సామర్ధ్య పెంపు, నూతన ఉత్పత్తుల

మెటల్‌ షేర్ల టార్గెట్‌ ధరల్లో కోత విధించిన మోర్గాన్ స్టాన్లీ

Tuesday 27th November 2018

ముంబై: దేశీ దిగ్గజ మెటల్‌ కంపెనీల లాభదాయకత దశాబ్దకాల గరిష్టానికి చేరుకోగా.. ఇదే సమయంలో వాల్యూయేషన్స్‌ కూడా ఇదే విధంగా పెరిగిపోయాయని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. డిమాండ్‌ పరంగా ఉన్నటువంటి రిస్క్‌, అధిక లివరేజ్‌ అంశాలను బేరీజువేసుకుని అనేక స్టీల్‌ రంగ షేర్ల టార్గెట్‌ ధరలను తగ్గించింది. ఎర్నింగ్స్‌, బ్యాలెన్స్‌ షీట్‌ పరంగా బలంగా ఉన్నటువంటి కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచిస్తూనే.. ఇంతకుముందు ప్రకటించిన టార్గెట్‌లను తాజాగా సవరించింది.

Most from this category