STOCKS

News


మూడోరోజూ లాభాల ముగింపే..!

Monday 15th April 2019
Markets_main1555323698.png-25144

 అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మార్కెట్‌ మూడోరోజూ లాభంతో ముగిసింది. కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చనే అంచనాలతో పాటు అంతర్జాతీయ ఆర్థిక మందగమన ఆందోళనలు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఫలితంగా మెటల్‌, అటో, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 139 పాయింట్ల పెరిగి 38,905 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,690 వద్ద స్థిరపడింది. అలాగే ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు లాభపడటంతో బ్యాంకు నిఫ్టీ అరశాతం(165పాయింట్లు) పెరిగి 30,104.25 వద్ద ముగిసింది. ప్రపంచమార్కెట్లలో మెటల్‌ షేర్లు ర్యాలీ చేయడంతో దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు మెరిశాయి. డాలరు మారకంలో రూపాయి బలహీనపడటంతో ఐటీ షేర్లు, టాటామోటర్స్‌ షేర్ల ర్యాలీ కారణంగా అటో షేర్లు అదరగొట్టాయి. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ , ఫార్మా, మీడియా షేర్లు మాత్రం నష్టపోయాయి.  
కోటక్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 7.50శాతం లాభపడగా, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, సన్‌ఫార్మా, ఇన్ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.



You may be interested

సీమెన్స్‌, థర్మాక్స్‌, భెల్‌పై మేనేజర్ల మక్కువ

Tuesday 16th April 2019

మార్చి నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ప్రత్యేకంగా కొన్ని షేర్లపై మక్కువ చూపించారు. క్యాపిటల్‌ గూడ్స్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, ఆర్డర్ల రాక మెరుగుపడడం ఈ రంగం పట్ల సానుకూతలకు కారణం. ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉండడం కూడా వీటిల్లో  పెట్టుబడులకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.    సీమెన్స్‌ కంపెనీలో డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ మార్చి నెలలో ఇన్వెస్ట్‌ చేసింది. మూలధన వ్యయాలు రికవరీతో ఈ కంపెనీ లాభపడుతుందని

11770 పాయింట్లను తాకేందుకే ఛాన్స్‌లెక్కువ!

Monday 15th April 2019

నిఫ్టీపై కోటక్‌ సెక్యూరిటీస్‌ గతవారం మొత్తం నిఫ్టీ దాదాపు ప్రతిరోజూ 11600 పాయింట్ల దిగువకు వచ్చి 11550 పాయింట్ల మద్దతును కోల్పోయేందుకే యత్నించింది. కానీ బుల్స్‌ తీవ్రంగా ఈ పతనాలను అడ్డుకొన్నారు. టాటామోటర్స్‌, మారుతీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, సిప్లా లాంటి షేర్ల అండతో సూచీలు రికవరీ బాట పట్టాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు లాంటి బడా దిగ్గజాలు సైతం నిఫ్టీకి అండగా నిలిచాయి. దీంతో ఈ వారం తిరిగి నిఫ్టీ పాజిటివ్‌

Most from this category