STOCKS

News


97 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Friday 13th July 2018
Markets_main1531454926.png-18273

  • 0.70 శాతం లాభాల్లో ఉన్న నిఫ్టీ ఐటీ
  • 0.02 శాతం లాభపడి 27,032 వద్ద ట్రేడవుతోన్న బ్యాంక్‌ నిఫ్టీ

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 11,050 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించగా.. సెన్సెక్స్‌ 97 పాయింట్లు లాభపడి 36,645 దగ్గర ప్రారంభమయ్యింది. 9 గంటల 30 నిమిషాల సమయానికి నిఫ్టీ 39 పాయింట్లు (0.38 శాతం) లాభపడి 11,064 దగ్గర ట్రేడవుతోంది. 11,071 పాయింట్లకు చేరుకుని ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఇదే సమయానికి సెన్సెక్స్‌ 167 పాయింట్లు (0.46 శాతం) లాభపడి 36,715 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ఇండీసెస్‌లో ఐటీ అత్యధికంగా 0.70 శాతం లాభాల్లో ఉండగా.. మెటల్‌ 0.35 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టీ 0.02 శాతం లాభపడి 27,032 వద్ద ట్రేడవుతోంది. నష్టపోతున్న రంగాలలో పీఎస్‌యూ బ్యాంక్‌ అత్యధికంగా 1.87 శాతం నష్టాల్లో ఉండగా.. రియల్టీ 0.63 శాతం, ఫార్మా 0.38 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా స్టాక్‌ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. డోజోన్స్‌ అత్యధికంగా 0.91 శాతం లాభాల్లో ముగియగా.. నాస్‌డాక్‌ 1.39 శాతం లాభపడింది. ఎస్‌ అండ్‌ పీ 0.87 శాతం లాభాల్లో ముగిసింది. మన మార్కెట్‌ ప్రారంభసమయానికి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా స్టాక్‌ సూచీ షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.12 శాతం నష్టాల్లో ట్రేడవుతుండగా.. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ అత్యధికంగా 2.07 శాతం లాభాల్లో ట్రేడవుతోంది. హాంగ్‌కాంగ్‌ సూచీ హాంగ్‌ సెంగ్‌ 0.58 శాతం లాభాల్లో ఉంది.



You may be interested

25 పైసలు బలపడిన రూపాయి

Friday 13th July 2018

10 గంటల సమయానికి 68.37 వద్ద ట్రేడింగ్‌ డాలర్‌తో రూపాయి మారకం విలువ శుక్రవారం ఉదయం లాభాలతో మొదలయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 25 పైసలు బలపడి 68.32 దగ్గర ప్రారంభమయ్యింది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా పడిపోవడం, దేశీయ స్టాక్‌ మార్కె‍ట్‌ లాభాల్లో ప్రారంభంకావడం వల్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరిగి రూపాయి విలువ బలపడిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. నిఫ్టీ

క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దు: సెబీ

Friday 13th July 2018

స్టాక్‌ బ్రోకర్లు తమ క్లయింట్ల నుంచి నగదు స్వీకరించొద్దని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. క్లయింట్ల నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి స్టాక్‌ బ్రోకర్లు నగదు తీసుకోకుండా నిషేధించింది. అయితే, ఐపీవో ఆఫర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు గాను ప్రత్యామ్నాయ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సెబీ ఉంది. అలాగే, లిస్టింగ్‌ ప్రక్రియను కూడా శీఘ్రతరం చేయనుంది. ‘‘ఈ రోజు ఎలక్ట్రానిక్‌ విధానంలో

Most from this category