STOCKS

News


35వేల దిగువకు సెన్సెక్స్‌

Monday 12th November 2018
Markets_main1542012240.png-21903

మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో అమ్మకాలు పెరగడంతో సూచీలు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. సెన్సెక్స్‌ సూచీ 200 పాయింట్లను క్షీణించి 35 వేల దిగువకు చేరుకుంది. నిఫ్టీ సూచీ 60 పాయింట్లకు పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు సెన్సెక్స్‌ 210 పాయింట్ల నష్టంతో 34985 వద్ద, నిఫ్టీ సూచీ 50 పాయింట్లను కోల్పోయి 10,510 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నేటి ఉదయం సూచీలు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ..,  కీలకమైన రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. ఫలితంగా సూచీలు మిడ్‌సెషన్‌ వరకు పరిమిత శ్రేణి కదలాడాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం  ఒక్క ఐటీ రంగ షేర్ల తప్ప మిగితా అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీల పూర్తిగా నష్టాల్లోకి మళ్లాయి. అత్యధికంగా అటో, ప్రభుత్వరంగ షేర్లలో విక్రయాలు జరిగాయి.



You may be interested

జపాన్‌ అతిపెద్ద ఐపీవో త్వరలో..

Monday 12th November 2018

21 బిలియన్‌ డాలర్ల సమీకరణలో సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రపంచంలోని అతిపెద్ద ఐపీవోల్లో ఇది ఒకటి అతి త్వరలోనే జపాన్‌లో అతిపెద్ద ఐపీవోను చూడబోతున్నాం. జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌కు చెందిన దేశీ టెలికం యూనిట్‌ ‘సాఫ్ట్‌బ్యాంక్‌ కార్ప్‌’ ఐపీవోకు రాబోతోంది. ఈ కంపెనీ డిసెంబర్‌ 19న టోక్యో స్టాక్‌ ఎక్చ్చేంజ్‌లో లిస్ట్‌ కాబోతుంది. సాఫ్ట్‌బ్యాంక్‌ కార్ప్‌ ఐపీవో ద్వారా 2.4 ట్రిలియన్‌ యెన్‌ల (21.1 బిలియన్‌ డాలర్లు) మేర నిధులను సమీకరించాలని భావిస్తోంది.

నష్టాల బాటలో టాటామోటర్స్‌ షేర్లు

Monday 12th November 2018

టాటా మోటార్స్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టింది. అక్టోబర్‌లో తన అనుబంధ సంస్థ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమైంది. నేడు షేరు బీఎస్‌ఈలో రూ.195.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు 5శాతం నష్టపోయి రూ.186.15ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు

Most from this category