STOCKS

News


మూడురోజుల లాభాలకు బ్రేక్‌..!

Tuesday 20th November 2018
Markets_main1542708828.png-22230

  • 10700 దిగువకు నిప్టీ
  • 300 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్‌

మార్కెట్‌ మూడురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఐటీ, మెటల్‌, ఫార్మాషేర్ల క్షీణతతో సెన్సెక్స్‌ 300 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మళ్లీ 10700ల దిగువకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి రెండున్నర నెలల స్థాయికి బలపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ,  ఫార్మా షేర్లు నష్టపోయాయి. ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు క్షీణించాయి. ప్రపంచమార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. గత రాత్రి అమెరికాలో టెక్నాలజీ షేర్ల పతనం, ఆసియా మార్కెట్ల నష్టాల ముగింపు, ఐరోపా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.  ముఖ్యంగా మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సెన్సెక్స్‌ 35,416 -  35,732 మధ్య కదలాడి చివరికి 300 పాయింట్ల నష్టంతో 35,474 వద్ద ముగిసింది. నిఫ్టీ 107 (1శాతం) పాయింట్ల నష్టపోయి 10656 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 10,641 - 10,741 మధ్య ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ 187.35 పాయింట్లు నష్టంతో 26,113 వద్ద ముగిసింది. ఒక్క రియల్టీ(0.05శాతం) తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది.
టాటాస్టీ్‌ల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 6శాతం నష్టపోయాయి. జీ లిమిటెడ్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, గెయిల్‌ షేర్లు అరశాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.


IT

You may be interested

సూచీలకు తాజా సవాళ్లు ఇవే..!

Tuesday 20th November 2018

ముంబై: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు.. 2019 లోక్‌ సభ పోల్స్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకులు తప్పవని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ రీసెర్చ్ హెడ్‌ దీపెన్‌ సేత్‌ విశ్లేషించారు. అమెరికా డాలర్‌ కదలికలు, 82-83 శాతం దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు ముడిచమురు ధరలు కీలకంగా ఉన్నాయని వివరించారు. స్వాతంత్రం వచ్చిన  ఏడు దశాబ్దాల తరువాత కూడా క్రూడ్‌ దిగుమతులపై ఆధారపడుతున్న భారత్‌కు

సెంట్రమ్‌ టెక్నికల్‌ సిఫార్సులు.!

Tuesday 20th November 2018

ముంబై: నిఫ్టీ 10,850 పాయింట్ల ఎగువన కొనసాగినప్పుడే 11,090 పాయింట్ల ర్యాలీకి ఆస్కారం ఉందని సెంట్రమ్‌ వెల్త్ మేనేజ్‌మెంట్‌ టెక్నికల్‌ హెడ్‌ ఆశిష్ చతుర్‌మెహతా విశ్లేషించారు. టెక్నికల్స్‌ పరంగా 20 శాతం వరకు రాబడిని ఇవ్వగలిగిన 5 షేర్లను ఆయన సిఫార్సుచేశారు. ఎన్‌ఆర్‌బీ బేరింగ్స్‌ | సిఫార్సు: కొనొచ్చు | ప్రస్తుత ధర: రూ.196 | స్టాప్ లాస్‌: రూ.185 | టార్గెట్ ధరల శ్రేణి: రూ.230-235 | రాబడి అంచనా:

Most from this category