News


నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 10th January 2019
Markets_main1547114718.png-23510

నాలుగు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు నష్టపోయి 36,106 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 10,821 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగ్గా అటో, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 191 పాయింట్ల నష్టపోయి 27,528 వద్ద స్థిరపడింది. అమెరికా-చైనాల మధ్య మూడు రోజలుగా జరిగిన వాణిజ్యచర్చలకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడికాకపోవడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీన పరిస్థితలు నెలకొన్నాయి.
కోటక్‌ బ్యాంక్‌, గ్రాసీం, ఇన్ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం నష్టపోగా, గెయిల్‌, బజాజ్‌ అటో, ఐషర్‌మోటర్స్‌, టాటామోటర్స్‌, టైటాన్‌ షేర్లు 1 నుంచి 1.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఐదు రంగాలు... ఏడు షేర్లు

Thursday 10th January 2019

ఎలారా క్యాపిటల్‌ సిఫార్సులు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉండొచ్చని ఎలారా క్యాపిటల్‌ రిసెర్చ్‌ హెడ్‌ రవిసుందర్‌ ముత్తుకృష్ణన్‌ చెప్పారు. ఇకమీదట ఎకానమీ బలపడుతుందన్నారు. దీర్ఘకాలిక ధృక్పథంలో పెట్టుబడులు పెట్టాలని, ప్రతి పతనంలో కొంత చొప్పున పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. సంవత్సరకాలానికి మంచి జోరు చూపించే ఐదు రంగాలను, వాటిలో ఏడు స్టాకులను ఆయన సిఫార్సు చేశారు. 1. బ్యాంక్స్‌: రిటైల్‌,

జీఎస్టీ తగ్గింపు​ఆశలతో రియల్టీ షేర్ల పరుగులు

Thursday 10th January 2019

నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీ తగ్గింపు ఆశలతో గురువారం ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నేడు జరిగే 32వ జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై ప్రస్తుతం 12శాతంగా ఉన్న జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ

Most from this category