STOCKS

News


సెన్సెక్స్‌ నష్టం 572 పాయింట్లు

Thursday 6th December 2018
Markets_main1544091721.png-22706

181 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ
ప్రపంచమార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ నష్టాలతోనే ముగిసింది. ఆయిల్‌, మెటల్‌ షేర్లు సూచీల భారీ పతనానికి కారణమయ్యాయి. వచ్చేవారం వెలువడనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, నేడు ఆస్ట్రేలియాలో జరగనున్న ఒపెక్‌ దేశాల సమావేశాల సందర్భంగా ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 527 పాయింట్లు నష్టపోయి 35,312 వద్ద, ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో 10,601 వద్ద ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో అధిక వెయిటేజ్‌ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మారుతి సుజుకీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల నష్టాల ట్రేడింగ్‌తో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగాయి.  అయితే యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలకే మొగ్గు చూపారు. ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా అటో ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.21శాతం(321 పాయింట్లు)నష్టపోయి 26,198 వద్ద ముగిసింది.
సూచీల నష్టాల కారణాలివే..!
రాజకీయ ఉద్రిక్తతలు:- కెనడా అధికారులు వాంకోవర్‌లో చైనా దేశపు మొబైల్ దిగ్గజ సంస్థ హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) మెంగ్ వెన్జో  అరెస్టు చేశారు. ఇరాన్‌పై అమెరికా విధించిన వాణిజ్యపరమైన నిబంధలను మెంగ్ ఉల్లంఘించినందున ఆమెను అరెస్ట్‌ చేస్తున్నామని, తదుపరి విచారణ కోసం అమెరికాకు తరలిస్తున్నామని కెనడా న్యాయశాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ అంశం అమెరికా, చైనా మధ్య మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతలకు కారణమవుతోందని ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ఫలితంగా నేడు ఆసియా, యూరప్‌లతో పాటు అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లో భారీ నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి.
ఇన్వెస్టర్ల అప్రమత్తత:- ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా మార్కెట్‌ భారీ పతనానికి మరో కారణమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పాటు, నేడు ఆస్ట్రియాలో జరగనున్న ఓపెక్‌దేశాల సమావేశ నిర్ణయాల కోసం కూడా ఇన్వెస్టర్ల ఎదురుచూస్తున్నారు. 2019 ప్రధాన ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వారం వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడే వరకు మార్కెట్‌ ఒడిదుడుకులకు గురి అవుతుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.
అధిక వెయిటేజీ షేర్ల పతనం:- అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకీ షేర్ల పతనం సూచీల భారీ నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్ల క్షీణత సూచీలకు అధిక నష్టాలను కలిగించాయి.
టాటామోటర్స్‌, టెక్‌మహీం‍ద్రా, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, మారుతి, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 4నుంచి 6శాతం నష్టపోగా, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ, సన్‌ఫార్మా, షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎన్నికల ఫలితాలపై మార్కెట్లేమంటున్నాయ్‌!

Thursday 6th December 2018

స్టాక్‌మార్కెట్లకు అస్థిరత అస్సలు నచ్చదు. దేశ రాజకీయ రంగంపై ఎలాంటి సందిగ్ధత కనిపించినా మార్కెట్లు భారీగా భయపడుతుంటాయి. ఎన్నికల సీజన్‌లో మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువ. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వీటి ఫలితాలపై మార్కెట్లు ఏమనుకుంటున్నాయి, ఎలా ప్రతిస్పందిస్తాయనేది ఆసక్తికరమైన అంశం. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మూడు హిందీబెల్ట్‌ రాష్ట్రాల ఫలితాలు

కంపెనీల ఎర్నింగ్స్‌లో భారీగా కోతలు

Thursday 6th December 2018

ముంబై: టాప్‌ 10 అనలిస్టులు ట్రాక్‌ చేస్తున్న 269 కంపెనీల్లో ఏకంగా 168 కంపెనీల ఎర్నింగ్స్‌ అంచనాల్లో సవరణజరిగింది. అంటే దాదాపు 60 శాతం కంపెనీల ఎర్నింగ్స్‌లో వీరు భారీగా కోతలు విధించారు. రూపాయి బలహీనత కారణంగా ఐటీ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాల కంపెనీల ఈపీఎస్‌లను తగ్గించారు. 18 కంపెనీల్లో ఏకంగా 50 శాతం వరకు అంచనాలను సవరించారు. అత్యధికంగా టెలికం, సిమెంట్‌, హాస్పటల్‌ రంగాల్లో ఈ

Most from this category