STOCKS

News


సెన్సెక్స్‌ 400 పాయింట్లు, నిఫ్టీ 130 పాయింట్లు క్రాష్‌

Monday 28th January 2019
Markets_main1548664349.png-23849

సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమై కొద్ది నిముషాల్లోనే నష్టాలకు జారుకున్న మార్కెట్లో మధ్యాహ్న సమయానికి అమ్మకాలు తీవ్రతరమయ్యాయి. దాంతో 1.40 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా పతనమై 35,605 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 130 పాయింట్లకుపైగా క్షీణించి 10,650 పాయింట్ల దిగువకు జారిపోయింది. మరో నాలుగురోజుల్లో జనవరి ఫ్యూచర్‌ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో బుల్స్‌ వారి లాంగ్‌ పొజిషన్లను పెద్ద ఎత్తున ఆఫ్‌లోడ్‌చేస్తున్న కారణఃగా ఈ పతనం సంభవించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యవసాయ రంగానికి కేంద్ర కేబినెట్‌ ప్యాకేజీ ప్రకటిస్తుందన్న వార్తలు, బడ్జెట్లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి, ద్రవ్యలోటు పెంచివేస్తారన్న అంచనాలు ఈ ఆఫ్‌లోడింగ్‌కు కారణమని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు సూచీల పతనానికి ప్రధాన కారణం. మధ్యాహ్న సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌లు 5 శాతంపైగా పతనం కాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 6 శాతం,  బజాజ్‌ ఫైనాన్స్‌ 8.5 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5 శాతం చొప్పున పడిపోయాయి. సిమెంటు షేర్లు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌లు 4 శాతం పతనమయ్యాయి. మరోవైపు ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌లు 1.5 శాతం లాభపడగా, గత శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసిన జీ ఎంటర్‌ప్రైజెస్‌ 12 శాతం కోలుకుంది. 



You may be interested

కలిసిరాని ఫలితాలు...కెనరా బ్యాంక్‌ 5 శాతం డౌన్‌

Monday 28th January 2019

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం (క్యూ3)లో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అధిక వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) అండతో పాటు మెరుగైన ఆస్తుల నిర్వహణ కారణంగా ఈ క్యూ3లో బ్యాంక్‌ ఏకంగా నికరలాభాన్ని 152శాతం పెంచుకుంది. గతేడాది ఇదే క్యూ3లో నికరలాభం రూ.125 కోట్లను నమోదు చేయగా, ఈ క్యూ3లో రూ.317.52 కోట్లను సాధించింది. నికర వడ్డీ ఆదాయం రూ.3184 కోట్లుగా నమోదైంది. గతేడాది

ఫార్మా, మెటల్‌, అటో షేర్ల అమ్మకాలు

Monday 28th January 2019

ఫార్మా, మెటల్‌, అటో షేర్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. పలు బ్రోకరేజ్‌ సంస్థలు పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ హెల్త్‌కేరే షేర్లకు ‘‘సెల్‌’’ రేటింగ్‌ కేటాయిస్తూ షేరు టార్గెట్‌ ధరను రూ.2000లకు కుదించడంతో ఈ షేరు అత్యధికంగా 7శాతం నష్టపోయింది. సిప్లా, కేడిలా హెల్త్‌కేర్‌ షేర్లు 2.50శాతం పతనంతో 52-వారాల కనిష్టానికి పతనమయ్యాయి. అలాగే అరబిందో ఫార్మా షేర్లు 3.50శాతం క్షీణించాయి. సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్‌, బయోకాన్,

Most from this category