STOCKS

News


సెన్సెక్స్‌ 1500 పాయింట్లు క్రాష్‌

Friday 21st September 2018
Markets_main1537516753.png-20440

  • 11,000 దిగువకు నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా రెప్పపాటు కాలంలో భారీగా పతనమైంది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఒకానొక సమయంలో ఏకంగా 1496 పాయింట్లమేర క్షీణించింది. 37,489 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే 35,993 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తర్వాత ఇండెక్స్‌లు కొంత కోలుకున్నాయి. మధ్యాహ్నాం 1:24 సమయంలో సెన్సెక్స్‌ 324 పాయింట్ల నష్టంతో 36,806 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 11,113 వద్ద ఉంది. నిఫ్టీ ఇంట్రాడేలో ఏకంగా 480 పాయింట్లమేర పతనమైంది. ఒకానొక సమయంలో 11,346 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి 10,866 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. 
నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ కూడా ఇంట్రాడేలో ఏకంగా ఒకానొక సమయంలో 1473  పాయింట్లమేర పతనమైంది. 26,490 పాయింట్ల గరిష్ట స్థాయిని, 25,053 పాయింట్ల  కనిష్ట స్థాయికి తాకింది. ప్రస్తుతం 385 పాయింట్ల నష్టంతో 25,892 వద్ద ట్రేడవుతోంది. 
శుక్రవారం సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,121 పాయింట్లతో పోలిస్తే 157 పాయింట్ల లాభంతో 37,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,234 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 



You may be interested

భ్యాంకింగ్‌ షేర్లలో అ‍మ్మకాలు

Friday 21st September 2018

ముంబై:- మార్కెట్‌లో ఒక్కసారిగా నెలకొన్న అమ్మకాల సునామీలో భాగంగా బ్యాంక్‌ షేర్లు నిలువునా పతనమవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4శాతం, నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 3.50శాతం, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4.50శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌:- అమ్మకాల వెల్లువతో ఇంట్రాడేలో 4శాతం(757 పాయింట్లు) పతనమైంది. ఈ సూచీలోని 10 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా యస్‌బ్యాంక్‌ 30శాతం నష్టపోయింది.

ట్రెండ్‌ రివర్స్‌: మార్కెట్‌ డౌన్‌

Friday 21st September 2018

గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నాం వరకు అదే జోరును కొనసాగించాయి. అయితే తర్వాత ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. మధ్యాహ్నాం 1:12 సమయంలో సెన్సెక్స్‌ 248 పాయింట్ల నష్టంతో 36,872 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 149 పాయింట్ల నష్టంతో 11,085 పాయింట్ల వద్ద ఉంది. నిఫ్టీ మళ్లీ 11,200 మద్దతు స్థాయి దిగువకు పతనమైంది.   ఇక నిఫ్టీ-50లో ఐఓసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 2 శాతానికిపైగా.. ఐటీసీ, హిందుస్తాన్‌

Most from this category