News


24 రోజులు.. 3,800 పాయింట్లు పతనం..

Thursday 4th October 2018
Markets_main1538644218.png-20856

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 24 సెషన్లలో ఏకంగా 3,820 పాయింట్లుమేర పతనమైంది. ఆగస్ట్‌ 29 నాటి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 38,989 పాయింట్ల నుంచి చూస్తే గురువారం నాటి ముగింపు స్థాయి 35,169 పాయింట్ల వరకు చూస్తే సెన్సెక్స్‌ దాదాపు 10 శాతం మేర క్షీణించింది. భారత్‌లో బుల్‌ మార్కెట్‌ కరెక‌్షన్‌ సగటున 14 శాతంగా ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. అలాగే సగటున రికవరీ సమయం సాధారణంగా 66 రోజులని పేర్కొంది. గరిష్ట స్థాయి నుంచి ఇటీవలి పతనం వరకు చూస్తే ఇప్పటికే నెలరోజులు పూర్తయ్యింది. అంటే కరెక‌్షన్‌ ఇంకా ఉందని అంచనా వేయవచ్చు. మార్కెట్‌ ఇక్కడి నుంచి ఇంకా కిందకు పడిపోవడం మంచిదేనని, అయితే ఇన్వెస్ట్‌మెంట్లకు ఇది సరైన సమయం కాదని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

అసలు జరిగిందేంటి?
ఆగస్ట్‌ లేదా దీని కన్నా ముందు మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలు ఏంటివి? 70 డాలర్ల లోపు ఉన్న క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు నుంచి 75 డాలర్లకు పెరిగాయి. దీంతో రూపాయి పడిపోయింది. ఆగస్ట్‌ 14న తొలిసారి 70 మార్క్‌ దిగువకు క్షీణించింది. అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు నడిచాయి. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరుగుదల భయాలు నెలకొన్నాయి. అయితే వీటన్నింటి కన్నా ముందుగానే సెన్సెక్స్‌ ఆగస్ట్‌లో రికార్డ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. వీటి ప్రభావం తర్వాతి నెల సెప్టెంబర్‌లో కనిపించడం ప్రారంభమైంది. అలాగే మార్కెట్‌ అధిక వ్యాల్యుయేషన్స్‌ కూడా విస్మరించింది. సెన్సెక్స్‌ 10 ఏళ్ల పీఈ సగటు 19.40 రెట్లుగా, 5 ఏళ్ల రేషియో 19.90 రెట్లుగా ఉంది. అయితే ఇండెక్స్‌ జనవరి 29న 26.40 రెట్లు వద్ద ట్రేడయ్యింది. తొలి భారీ కరెక‌్షన్‌ వల్ల వ్యాల్యుయేషన్లు కొంత తగ్గాయి. వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మార్జిన్లు కనిపించవు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ ఆందోళనలతో సెంటిమెంట్‌ బాగా దెబ్బతినింది. హఠాత్తుగా మార్కెట్‌ పూర్తిగా నెగటివ్‌గా స్పందించడం ప్రారంభించింది. ఇటీవలి కరెక‌్షన్‌కు తర్వాత కూడా ఇతర వర్ధమాన మార్కెట్లతో ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ను సాపేక్షంగా పోల్చి చూస్తే ఔట్‌పర్ఫార్మర్‌గానే ఉంది. 

అక్టోబర్‌ చెడ్డ నెల కాదు..
2008 అక్టోబర్‌ నెలలో సెన్సెక్స్‌ 24 శాతంమేర పతనమైంది. ఇండెక్స్‌ అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన నెల ఇదే. అయితే గత పదేళ్లలో 2009లో సెన్సెక్స్‌ 7 శాతం క్షీణించింది. ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. గత ఎనిమిదేళ్లలో సెన్సెక్స్‌ సగటున అక్టోబర్‌లో 3.6 శాతం రిటర్న్స్‌ అందించింది. ఈ ఎనిమిదేళ్లలో ఇండెక్స్‌ కేవలం రెండుసార్లు మాత్రమే అక్టోబర్‌ నెలలో నెగటివ్‌ రిటర్న్స్‌ను అందించింది. ఫిబ్రవరిలోని బడ్జెట్‌ తర్వాతి కరెక‌్షన్‌ చారిత్రక సగటు శ్రేణిలోనే ఉంది. అప్పుడు సెన్సెక్స్‌ 10 శాతం కరెక‌్షన్‌కు గురయ్యింది. 55 రోజుల్లో రికవరీ అయ్యింది. 

వ్యాల్యుయేషన్స్‌ ఓకేనా..
‘వ్యాల్యుయేషన్స్‌ సగటు కన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నా కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. ఈక్విటీ వ్యాల్యుయేషన్స్‌ ప్రమాదకర స్థాయిలో లేవు. బుల్‌ మార్కెట్‌ కరెక‌్షన్‌ కారణంగా స్టాక్‌ ధరల్లో నెగటివ్‌ కదలికలు కొనసాగవచ్చు’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇన్వెస్టర్లు సమీప కాలంలో ఆర్‌బీఐ పాలసీ సమావేశం, కంపెనీల క్యూ2 ఎర్నింగ్స్‌పై దృష్టి కేంద్రీకరించాలి. రూపాయి క్షీణత, లిక్విడిటీ కొరత, ఫెడ్‌ రేట్ల పెంపు, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడిందని యాంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ పేర్కొంది. 

ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
2018-19 ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్‌కు 20 రెట్లు వద్ద నిఫ్టీ-50 ట్రేడవుతోందని, ఇది అధిక వ్యాల్యుయేషన్లే అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. లార్జ్‌క్యాప్స్‌ విభాగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, మారుతీ, హెచ్‌యూఎల్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా షేర్లకు ప్రాధాన్యమివ్వొచ్చని పేర్కొంది. ఇక మిడ్‌క్యాప్స్‌ విభాగం నుంచి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, మైండ్‌ట్రీ, టాటా కెమికల్స్‌, టీమ్‌ లీజ్‌, ఇమామి స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది కాలానికి రేమాండ్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, ఎంఫసిస్‌, ఎఫ్‌డీసీ స్టాక్స్‌కు ప్రాధాన్యమివ్వొచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సూచించింది.   

 
   You may be interested

ఐసీఐసీఐకి చందా కొచర్‌ రాజీనామా!!

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.

ఈ పతనం.. ఎందుకు?

Thursday 4th October 2018

దేశీ స్టాక్‌మార్కెట్‌ ఆరంభంలోనే భారీగా పతనమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 1.5 శాతానికిపైగా పడిపోయాయి. సమయం గడిచే కొద్ది నష్టాలు కూడా పెరిగాయి. మధ్యాహ్నాం కల్లా ఇండెక్స్‌లు 2.5 శాతంమేర క్షీణించాయి. సెన్సెక్స్‌-30 దాదాపు 850 పాయింట్లమేర పడిపోయింది. నిఫ్టీ-50 దాదాపుగా 250 పాయింట్లమేర క్రాష్‌ అయ్యింది. 10,600 మార్క్‌ను పరిక్షీస్తోంది. నిఫ్టీలో సుమారు 41 స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. ఐషర్‌ మోటార్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, గెయిల్‌

Most from this category