News


ఎలక‌్షన్‌ తర్వాత కరెక‌్షన్‌?

Monday 8th April 2019
Markets_main1554709825.png-25005

నిపుణుల అంచనా
గత నాలుగు దఫాల ఎన్నికల సందర్భంగా మూడుమార్లు దేశీయ సూచీలు ప్రీ ఎలక‌్షన్‌ర్యాలీ జరిపాయి. అదేవిధంగా ఎక్కువ మార్లు పోస్ట్‌ ఎలక‌్షన్‌ కరెక‌్షన్‌ చూపాయి. గతంలోలాగే ఈ సారి కూడా ఎన్నికల ముందు ప్రీఎలక‌్షన్‌ర్యాలీ నడుస్తున్నందున, తప్పకుండా ఎన్నికల అనంతరం పతనం ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు గతంలో ఎక్కువమార్లు సూచీలు దాదాపు 10 శాతం ర్యాలీ జరిపాయని ఓనీల్‌ ఇండియా రిసెర్చ్‌ డైరెక్టర్‌ విపిన్‌ ఖేర్‌ చెప్పారు. ఈ సారి కూడా అలాగే ఎన్నికల ఫలితాలపై అంచనాలతో సూచీలు ముందుకు దూసుకుపోతున్నాయని, ఒక్కమారు ఎన్నికలు పూర్తయ్యాక ప్రాఫిట్‌ బుకింగ్‌ వస్తుందని అంచనా వేశారు. ఎందుకంటే అంచనాల కన్నా వాస్తవాలు నిరాశాపూరితంగా ఉంటాయని, అందువల్ల అంచనాల ఆధారిత ర్యాలీ అనంతరం కరెక‌్షన్‌ వస్తుంటుందని తెలిపారు. కానీ ఈ సూత్రానికి 1999 ఎన్నికల సమయం మినహాయింపన్నారు. ఆ సమయంలో సూచీలు ప్రీఎన్నికల పతనం, పోస్ట్‌ ఎలక‌్షన్‌ ర్యాలీ చూపాయని బీఎన్‌పీ పారిబా తెలిపింది.


ఈ సారి ఎలా ఉంటుందో?
మోదీ ప్రభుత్వం మరలా వస్తుందన్న ఆశలతో సూచీలు మార్చిలో మంచి లాభాల పంట పండించాయి. అయితే అంతా అనుకున్నట్లు మోదీ ప్రభుత్వం మరలా వచ్చినా సూచీలు అప్పటికే ఆ విషయాన్ని డిస్కౌంట్‌ చేసి ఉంటాయని అందువల్ల ఇప్పుడున్నంత జోష్‌ ఫలితాల అనంతరం ఉండదని బీఎన్‌పీ పారిబా నివేదిక వ్యాఖ్యానించింది. ఉదాహరణకు 2014లో ప్రీఎలక‌్షన్‌లో ఉన్నంత జోష్‌ సూచీల్లో ఎన్నికల అనంతరం కనిపించలేదని గుర్తు చేసింది. ఫలితాలు అంచనాలకు అనుగుణంగా వచ్చినా మార్కెట్లు పెద్దగా జోరు చూపలేదని తెలిపింది. ఈ సారి ర్యాలీకి ప్రధాన కారణం ఎఫ్‌ఐఐలని, ఎఫ్‌ఐఐలు సాధారణంగా అంచనాలతో పెట్టుబడులు పెడతారని తెలిపింది. వారి అంచనాలకు అనుగుణ ఫలితాలు వస్తే మరో 1,2 నెలలు పెట్టుబడుల జోరు చూపించి ఆ తర్వాత సైలంటవుతారని, అదే అంచనాలకు వ్యతిరేకంగా ఫలితాలుంటే మాత్రం భారీగా నిధుల ఉపసంహరణ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ తరుణంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసిన స్టాకులను మాత్రమే పోర్టుఫోలియోలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 



You may be interested

70 డాలర్లపైన ముడిచమురు

Monday 8th April 2019

ఐదు నెలల గరిష్ఠానికి  చేరిక  అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు అప్‌మూవ్‌ కొనసాగుతోంది. తాజాగా బ్రెంట్‌ క్రూడ్‌ ధర 70.72 డాలర్లను తాకింది. గతేడాది నవంబర్‌ తర్వాత క్రూడ్‌ ధర ఈ రేంజ్‌కు చేరడం ఇదే తొలిసారి. డబ్ల్యుటీఐ క్రూడ్‌ ధర 63.45 డాలర్లను తాకింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే క్రూడాయిల్‌ ధర 30 శాతం మేర దూసుకుపోయిందని జేపీ మోర్గాన్‌ వెల్లడించింది. యూఎస్‌ ఆంక్షలు, ఒపెక్‌ ఉత్పత్తి కోతలు, వాణిజ్యయుద్ధం

11760కి పైన నిలిస్తే 12వేల పాయింట్లు పక్కా!

Monday 8th April 2019

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ప్రస్తుతం స్వల్పకాలానికి నిఫ్టీ బుల్స్‌ పట్టులో ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌ పల్వియా చెప్పారు. నిఫ్టీ 11760 పాయింట్లపైన బలంగా నిలబడితే త్వరలో 12వేల పాయింట్లను తాకవచ్చని అంచనా వేశారు. ఒకవేళ 11550 పాయింట్లను కోల్పోతే బేర్స్‌ ఎంటరవుతారన్నారు. చార్టుల్లో నిఫ్టీ హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ వస్తోందని, ఇది క్రమానుగత అప్‌ట్రెండ్‌కు సంకేతమని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫ్టీ 11850- 12200 పాయింట్లను చేరవచ్చని

Most from this category