STOCKS

News


50వేల పాయింట్లు పక్కా!

Friday 15th March 2019
Markets_main1552628758.png-24623

సెన్సెక్స్‌పై నిపుణుల అంచనా
మార్కెట్లో బుల్‌రన్‌ దీర్ఘకాలం కొనసాగుతుందని, వచ్చే దశాబ్దంలో సెన్సెక్స్‌ తప్పక 50వేల పాయింట్ల మైలురాయిని దాటేస్తుందని పలువురు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2009లో ఆరంభమైన బుల్‌రన్‌ ఈ ఏడాది పదేళ్లు పూర్తి చేసుకుందని మోర్గాన్‌స్టాన్లీ నివేదిక తెలిపింది. దేశ ఈక్విటీ చరిత్రలో ఇది అత్యంత సుదీర్ఘమైన, నెమ్మదైన బుల్‌పరుగని తెలిపింది. ఈ పరుగులో మార్కెట్‌ పదేళ్లలో సరాసరిన 16 శాతం వార్షిక రాబడినిచ్చింది. ఈ ఏడాది చివరకు ఇదే జోరు కొనసాగితే సెన్సెక్స్‌ 42వేల పాయింట్లను తాకుతుందని అంచనా వేసింది. సెన్సెక్స్‌ తన 25ఏళ్ల ముందస్తు పీఈ అంచనా సరాసరికి కాస్త అటుఇటుగా కదలాడుతోందని వివరించింది. అందువల్ల ఈ బుల్‌ పరుగు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 50 వేల పాయింట్లను చేరవచ్చని తెలిపింది. అంతర్జాతీయ వ్యాపార వలయాలు పరిణితి చెందుతున్నాయని, వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఒక దఫా మందగమనం వచ్చే ఛాన్సులున్నాయని, అందువల్ల వచ్చే ఏడాది కొంత అప్రమత్తత అవసరమని కార్వీ బ్రోకింగ్‌ పేర్కొంది. దీర్ఘకాల ర్యాలీకి పునాదులు పడుతున్నాయని, అందువల్ల సెన్సెక్స్‌ 1,00,000 పాయింట్లకు చేరవచ్చని ఎలిక్సర్‌ ఈక్విటీస్‌ తెలిపింది. ఎఫ్‌పీఐలు మన మార్కెట్లో భారీగా నిధులు కుమ్మరిస్తున్నాయని, అందువల్ల ఎంపిక చేసిన నాణ్యమైన స్టాకులతో పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సూచించింది. 
స్వల్పకాలిక అవరోధాలు
అంతర్జాతీయ మందగమన భయాలతో పాటు రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆందోళనలు స్వల్పకాలంలో మార్కెట్‌ పరుగులకు అవరోధంగా మారవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే గత నెల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంలో వెనుకడుగు కనిపించింది. అయితే ఇవన్నీ స్వల్పకాలిక ఆందోళనలేనని, తాజా పరుగు ఎన్నికల ఫలితాల ఆధారితం కాదని, మూలాలు బలంగా ఉన్నాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతోనే విదేశీ మదుపరులు దేశీయ మార్కెట్లో భారీగా నిధులు కుమ్మరిస్తున్నారని మోతీలాల్‌ఓస్వాల్‌ వివరించింది. కొత్త ఏడాది ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు చర్యలు చేపట్టవచ్చని, అందువల్ల సూచీలు ముందుకే సాగుతాయని పేర్కొంది. కేంద్రంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా దేశీయ మార్కెట్‌ పరుగు ఉంటుందని గత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెన్సెక్స్‌ అత్యధిక రాబడులు సంకీర్ణ ప్రభుత్వాల హయంలోనే సాధించడం గమనార్హం. ఇదే సమయంలో అల్ప రాబడి సైతం సంకీర్ణ ప్రభుత్వాల టైంలోనే నమోదయింది. అయితే స్థిర ప్రభుత్వాలు ఏర్పడప్పుడు మార్కెట్‌ రిటర్న్స్‌ దీర్ఘకాలిక సరాసరి కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కూడా ఇదే ధోరణి ఉంటుందని, ఈక్విటీలు సమీప భవిష్యత్‌లో దూసుకుపోతాయని క్వాటమ్‌ బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. 
You may be interested

మళ్లీ 1300 డాలర్ల దిగువకు పసిడి

Friday 15th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర తిరిగి 1300డాలర్ల దిగువకు చేరుకుంది. యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ ఒ‍ప్పంద ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ పసిడి ధరపై అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి ఎలాంటి ఒప్పందం లేకుండా బ్రిటన్‌ నిష్క్రమించాలనే ప్రతిపాదన బ్రిటన్‌ దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌లో వీగిపోయింది. మరోవైపు ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ ఐదురోజుల తర్వాత తిరిగి పుంజుకోవడం పసిడికి ప్రతికూలాంశగా

బ్యాంకు నిఫ్టీ 1.50శాతం అప్‌

Friday 15th March 2019

 ఈ వారం ప్రారంభంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50ని అధిగమించి, కొత్త గరిష్టస్థాయికి చేరిన బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ వారాంతపు రోజైన శుక్రవారం 29,400 పాయింట్ల స్థాయిని అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పింది.  ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల భారీ ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైన అరగంటకే1.50శాతం(483 పాయింట్లు) లాభపడింది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,

Most from this category