STOCKS

News


ఎన్నికల తర్వాత 44,000కు సెన్సెక్స్‌

Wednesday 17th October 2018
Markets_main1539718749.png-21212

సమీప కాలంలో సెన్సెక్స్‌ 36,000-36,500 వరకు వెళుతుందని, వచ్చే సాధారణ ఎన్నికల అనంతరం 44,000కు చేరుకుంటుందని ఎన్‌వీఎస్‌ బ్రోకరేజ్‌ డైరెక్టర్‌ నలిన్‌షా అంచనా వ్యక్తం చేశారు. మార్కెట్‌ కరెక్షన్‌ ముగిసిందని, సెన్సెక్స్‌ 22,900 స్థాయిలో బోటమ్‌ అయినట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి, కేంద్రం ఎగుమతులను పెంచలేకపోవడం రూపాయిపై ఒత్తిడికి దారితీస్తాయన్నారు. ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలోని అగ్రగామి కంపెనీలు బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తిరిగి వేగంగా రికవరీ అవుతాయని చెప్పారు. ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, కోటక్‌ మహింద్రా బ్యాంకు పట్ల సుముఖంగా ఉన్నామని చెప్పారు. రానున్న మూడేళ్ల కాలానికి మంచి రిటర్నులకు అవకాశమున్న స్టాక్స్‌ను ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.

 

స్టెరిటైల్‌ టెక్నాలజీస్‌
ప్రపంచంలోనే ఏకైక సమగ్ర కేబుల్‌ తయారీ సంస్థ. 2019 జూన్‌ నాటికి సామర్థ్యాన్ని 53ఎంఎఫ్‌కేఎంకు పెంచుకోనుంది. బలమైన ఆర్డర్లు ఉండడం, 5జీ టెక్నాలజీ రాకతో ఓఎఫ్‌సీ వినియోగం వైపు మళ్లడం వల్ల రానున్న 10-12 ఏళ్లలో మంచి వృద్ధికి అవకాశం ఉంది. స్టాక్‌ టార్గెట్‌ ధర రూ.450.
బీఎస్‌ఈ లిమిటెడ్‌
సెక్యూరిటీ సేవల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. బీఎస్‌ఈలోనే నమోదైన స్టాక్స్‌ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం, స్టార్‌ ఎంఎఫ్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి అధిక ఆదాయం, కరెన్సీ డెరివేటివ్స్‌లో అధిక మార్కెట్‌ వాటా, ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సేంజ్‌ ద్వారా ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గణనీయమైన నగదు నిల్వలు ఉండడం, అధిక డివిడెండ్‌ రాబడి, మరిన్ని అస్సెట్‌ క్లాసెస్‌ను ప్రవేశపెట్టడం, కరెన్సీ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐల ట్రేడింగ్‌పై నియంత్రణలు సవరించేందుకు ఉన్న అవకాశాలు, మరిన్ని అంతర్జాతీయ కమోడిటీలను ప్రవేశపెట్టడం సానుకూలతలు. టార్గెట్‌ రూ.850-900
బజాజ్‌ ఫైనాన్స్‌
కంపెనీ మొత్తం ఆస్తుల్లో కన్జ్యూమర్‌ వ్యాపారం వాటా 47 శాతంగా ఉంది. ఇది చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. వాణిజ్య వ్యాపారం వృద్ధి 50-55 శాతంగా ఉంది. వైట్‌ గూడ్స్‌ మార్కెట్‌ వృద్ధికి అవకాశం ఉంది. కన్జ్యూమర్‌ ఉత్పత్తులను వినియోగించి, మార్చివేసే కాల వ్యవధి తగ్గుతుండడం, ద్విచక్ర వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి కంపెనీకి కలిసొచ్చే అంశాలు. టార్గెట్‌ రూ.3,000.
టాటా మోటార్స్‌
దేశీయ వ్యాపారం వాటా పెరుగుతోంది. జేఎల్‌ఆర్‌ రూ.42,000 కోట్లతో విస్తరణ చేపట్టింది. ఆర్‌అండ్‌డీపై అధిక పెట్టుబడులు, ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి అభివృద్ధి సైకిల్‌ తగ్గించడం, అధిక పనితీరును చూపే ఎలక్ట్రిక్‌ వాహనాలను అభివృద్ధి చేయడం, వ్యయ నియంత్రణ చర్యలు, చైనా, భారత్‌ జీడీపీ వృద్ధి దృష్ట్యా టాటా మోటార్స్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి. టార్గెట్‌ రూ.350. 
టీవీఎస్‌ మోటార్స్‌
కొత్త ఉత్పత్తుల విడుదల, డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం, కస్టమర్ల సంతృప్తి విషయంలో ఉత్తమ కంపెనీగా వరుసగా మూడో ఏడాది నిలవడం, బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ కంపెనీతో భాగస్వామ్యం, మార్జిన్ల విస్తరణ అంశాలతో ఆటోమొబైల్‌లో టీవీఎస్‌ టాప్‌ పిక్‌. టార్గెట్‌ రూ.750You may be interested

భారీ లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Wednesday 17th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం భారీ లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:48 సమయంలో 124 పాయింట్ల లాభంతో 10,709 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,589 పాయింట్లతో పోలిస్తే 120 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ బుధవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాలతో కళకళలాడతున్నాయి.

విక్రయానికి సౌర్వభౌమ బంగారం బాండ్లు

Wednesday 17th October 2018

కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను సార్వభౌమ బంగారం బాండ్ల విక్రయాన్ని ఈ నెలలోనే ప్రారంభించనుంది. ఈ నెల 19వ తేదీ వరకు కొనుగోలుకు అవకాశం ఉంది. ఈ సందర్భంగా సౌర్వభౌమ బంగారం బాండ్ల గురించి కొన్ని ముఖ్య విషయాలు... వ్యక్తులు విడిగా, మరొకరితో కలసి జాయింట్‌గానూ ఈ బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రూ.4 కిలోల వరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మైనర్‌ పేరిటా బాండ్‌

Most from this category