STOCKS

News


రికార్డుల ర్యాలీకి బ్రేక్‌

Friday 10th August 2018
Markets_main1533896532.png-19128

  • 38వేల దిగువకు సెన్సెక్స్‌
  • 11450 మార్కును కోల్పోయిన నిఫ్టీ

స్టాక్‌ మార్కెట్లో సూచీల రికార్డుల పరంపరకు శుక్రవారం బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజుల నుంచి దలాల్‌ స్ట్రీల్‌లో హల్‌చల్‌ చేస్తున్న బుల్స్‌ నేటి ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల నష్టపోయి 37,869 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41.20 పాయింట్లు నష్టపోయి 11,429.50ల వద్ద ముగిశాయి. గత ట్రేడింగ్‌ సెషన్లలో భారీ లాభాలు ఆర్జించిన ప్రభుత్వరంగ బ్యాంకు, మెటల్‌ షేర్లలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు జరపడం, ఫార్మా రంగ షేర్లు వరసగా మూడో రోజు నీరసించడం, అంతర్జాతీయంగా సంకేతాలు ప్రతికూలంగా ఉండటం కూడా తోడవ్వడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 197 పాయింట్లు, నిఫ్టీ 58 పాయింట్ల మేర నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకు సూచీ అత్యధికంగా(4 శాతం) నష్టపోగా, మెటల్‌ సూచీ 2 శాతం, ఫార్మా 1.50శాతం, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ అరశాతం నష్టపోయాయి. కీలకమైన బ్యాంకు నిఫ్టీ సూచీ 195.75 పాయింట్ల నష్టపోయి 28,124 వద్ద ముగిసింది. మరోవైపు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగాలకు చెందిన షేర్లు అరశాతం వరకు లాభపడ్డాయి.
ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల కుదేల్‌..!
రెండు రోజులుగా భారీగా ర్యాలీ చేసిన ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో నేడు భారీగా లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌ 4శాతం మేరకు నష్టపోయింది. ముఖ్యంగా నేడు త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఎస్‌బీఐ షేరు తీవ్ర ఒడిదుడుకులకులోనైంది. నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఎస్‌బీఐ షేరు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో  తిరిగి లాభాల్లోకి మళ్లింది. వెనువెంటనే పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ ఫలితంగా  4.50శాతం నష్టంతో ముగిసింది. నేడు నిఫ్టీ కోల్పోయిన 41 పాయింట్లో ఒక్క ఎస్‌బీఐ షేర్లవి 11.22 పాయింట్లు కావడం విశేషం.
సన్‌ఫార్మా, గెయిల్‌, టాటామోటర్స్‌, వేదాంత, ఎస్‌బీఐ షేర్లు 3నుంచి 4.50శాతం నష్టపోగా, హెచ్‌సీఎల్‌ షేరు, ఎం అండ్‌ ఎం, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు 1నుంచి 5శాతం లాభపడ్డాయి.



You may be interested

12 శాతం తగ్గిన అరబిందో లాభం

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జూన్‌ త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3 శాతంగా ఉంది. యూఎస్‌, యూరప్‌ మార్కెట్‌ జోష్‌ కంపెనీకి తోడైంది. యూఎస్‌ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్‌ ఫార్ములేషన్‌ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199

6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చాం

Friday 10th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇప్పటి వరకు 6,700 యూనిట్లకు క్లియరెన్సులు ఇచ్చామని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం వెల్లడించారు. వీటి ద్వారా రూ.1,36,000 కోట్ల పెట్టుబడులను ఆకర్శించామని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. పరోక్షంగా మరో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని వివరించారు. ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల విస్తరణకు తోడ్పాటు

Most from this category