STOCKS

News


ఆరురోజుల ర్యాలీకి బ్రేకులు

Tuesday 4th December 2018
Markets_main1543918674.png-22622

  • లాభాల స్వీకరణకు పూనుకున్న ఇన్వెస్టర్లు
  • ఆర్‌బీఐ విధానం కోసం ఎదురుచూపులు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో సూచీల ఆరురోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ రేపు(బుధవారం) కీలక వడ్డీరేట్లపై తన విధానాన్ని ప్రకటిస్తున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ర్యాలీ కొనసాగుతుండంతో నేటి ట్రేడింగ్‌లో కూడా డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతీసింది. అమెరికా - చైనా దేశాల మధ్య ఇటీవల కుదురిన వాణిజ్య యుద్ధ సంధిపై అనుమానాలు రేకెత్తడంతో ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు సూచీలు ఆరు రోజులుగా సుధీర్ఘ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా సెన్సెక్స్ 106.69 పాయింట్లు కోల్పోయి 36,134.31 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 10,869 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 157 పాయింట్లు నష్టపోయి 26,700 వద్ద స్థిరపడింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం క్షీణతతో నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసుల ఇండెక్స్‌ (0.64 శాతం) నష్టపోయింది. మరోవైపు రూపాయి కరిగిపోవడంతో డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొస్తుంది. ఫలితంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.64శాతం లాభపడింది. అలాగే మెటల్‌, ఫార్మా రంగాల ఇండెక్స్‌ సైతం స్వల్పంగా లాభపడ్డాయి.
ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసీం, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఐఓసీ, ఇండియాబుల్‌హౌసింగ్‌, యూపీఎల్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

హెచ్‌యూఎల్‌ షేరును ఏంచేద్దాం..?

Tuesday 4th December 2018

ముంబై: హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) షేరు ధర మంగళవారం ఒకదశలో రూ.1,848.95 వద్దకు చేరుకుని జీవితకాల గరిష్టస్థాయిని తిరగరాసింది. అయితే, మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.15 (0.80 శాతం) నష్టపోయి రూ.1,811 వద్ద ముగిసింది. గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌కు (జీఎస్‌కే) డీల్‌ ప్రకటన అనంతరం షేరు ధర ఎగసినప్పటికీ.. లాభాల స్వీకరణ కారణంగా ఒక శాతం మేర నష్టాలను నమోదుచేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌యూఎల్‌ షేరుపై మార్కెట్‌ విశ్లేషకులు

మిడ్‌క్యాప్‌ ఐటీ భేష్‌

Tuesday 4th December 2018

ముంబై: దేశీ స్టాక్‌ సూచీలు ముడిచమురు ధరల ఒడిదుడుకులకు, రూపాయి కదలికలకు నాట్యం చేశాయని వ్యాఖ్యానించిన ప్రముఖ స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్ పొరింజు వెలియాత్.. అసలైన సవాళ్లు మార్కెట్‌లో ఇంకా ఉన్నాయని అన్నారు. వాణిజ్య యుద్ధం, ఎన్‌బీఎఫ్‌సీ అంశాలను మార్కెట్‌ మరీ అతిచేసి చూసిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించిన ఆయన.. ఇప్పుడు ఈ అంశాలను సాధారణంగా చూస్తూ ర్యాలీకి ఒక కారణంగా చూపుతున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో

Most from this category