STOCKS

News


సెన్సెక్స్‌ మైనస్‌...నిఫ్టీ ప్లస్‌

Tuesday 13th March 2018
Markets_main1520937168.png-14623

5శాతం పతనమైన టీసీఎస్‌
లాభపడ్డ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు

ముంబై:- దేశీయ స్టాక్ మార్కెట్‌ చివరిగంటలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై..చివరకు దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది.  బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్సెక్స్ 61.16 పాయింట్ల నష్టంతో 33,856 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.45 పాయింట్ల లాభంతో 10,426.85 వద్ద ముగిసింది.  పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, ఫార్మా, మీడియా, మెటల్‌ రంగాల షేర్లు లాభాల్లో ముగియగా, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ షేర్లు నష్టాలతో ముగిశాయి. కీలమైన బ్యాంక్‌ నిఫ్టీ 74.45 పాయింట్లు లాభపడి 24,738.65 వద్ద స్థిరపడింది.
ఆద్యంతం ఒడిదుడుకులమయం:-
నిన్నటి భారీ లాభాలతో నేపథ్యంలో నేడు ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ మొగ్గుచూపడంతో మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది.
ఫిబ్రవరి నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం, జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మెరుగవ్వడం... వంటి అంశాలు ఇన్వెస్టర్ల ఉత్సాహానిచ్చాయి. దీంతో మార్కెట్‌ తిరిగి లాభాల్లో నడిచింది.

ఉన్నట్టండి నష్టాల్లోకి
చివరిగంటలో ఉన్నట్టుండి ఊపందుకున్న అమ్మకాలతో మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి మళ్లింది. మిడ్‌సెషన్‌ వరకు పటిష్టమైన లాభాలతో కదిలిన మార్కెట్‌ అమ్మకాలు పెరగడంతో ఒక్కసారిగా నష్టాలలోకి ప్రవేశించాయి. అయితే యూరోపియన్‌ మార్కెట్ల పాజిటివ్‌ ట్రేడింగ్‌ ఫలితంగా చివరకు దాదాపు భారత్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిసాయి.  
టీసీఎస్‌ 5శాతం పతనం:-
ఈ కంపెనీలో టాటా సన్స్‌ రూ.8,122 కోట్ల (1.25 బిలియన్‌ డాలర్లు) విలువైన వాటాను బల్క్‌డీల్‌ రూపంలో అమ్మివేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో షేరు 5శాతానికి పతనమైంది.
 టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 1 నుంచి 5శాతం పతనం కాగా, సన్‌ ఫార్మా, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ నుంచి టెక్నికల్‌ రికమండేషన్లు

Tuesday 13th March 2018

1. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1200. స్టాప్‌లాస్‌ రూ. 1060. ఇటీవలే సుదీర్ఘ కన్సాలిడేషన్‌ నుంచి బయటకు వచ్చింది. తాజాగా డైలీ చార్టుల్లో బుల్లిష్‌ ఫ్లాగ్‌ ఏర్పరిచింది. హయ్యర్‌ లోను ప్రతిరోజు ఏర్పరచడం కిందస్థాయిలో కొనుగోళ్లకు చిహ్నం. స్టొకాస్టిక్స్‌ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.  2. కేపీఐటీ టెక్‌: కొనొచ్చు.  టార్గెట్‌ రూ. 260. స్టాప్‌లాస్‌ రూ. 205. నెలవారీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ను ఏర్పరిచింది.

ఆకర్షణీయ డివిడెండు కోసం 5 షేర్లు..!

Tuesday 13th March 2018

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా కొనసాగుతున్నప్పటికీ పలు కంపెనీల షేర్లు మాత్రం ఆకర్షణీయంగానే ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి పలు ప్రభుత్వ రంగ కంపెనీలకు చెందిన షేర్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హైలైట్‌ అవుతాయని చెబుతున్న వీరు.. ఇందుకు ప్రధాన కారణం డివిడెండ్‌ అని అంటున్నారు. ప్రస్తుతం ఫిక్సిడ్‌ డిపాజిట్లపై బ్యాంకులు 6-7 శాతం వడ్డీ చెల్లిస్తుండగా, ఈ స్థాయిలో డివిడెండ్‌ ఈల్డ్‌ ఇవ్వడంలో పలు

Most from this category