News


మూడురోజుల నష్టాలకు బ్రేక్‌

Monday 26th November 2018
Markets_main1543228827.png-22394

  • 10,600 పైన నిఫ్టీ
  • రాణించిన ఎఫ్‌ఎంజీసీ షేర్లు
  • 373 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మూడురోజుల నష్టాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ పతనం, డాలర్‌ మారకంలో రూపాయి 3నెలల గరిష్టానికి చేరుకోవడంతో ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా సూచీల లాభాలకు తోడ్పాటును అందించాయి. మిడ్‌సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు అనంతరం స్థిరమైన ర్యాలీ చేశాయి. చివరకు సెన్సెక్స్‌ 373 పాయింట్లను ఆర్జించి 35,354 వద్ద, నిఫ్టీ 102 పాయింట్లు లాభపడి 10,628 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌, ఫార్మా(1.32శాతం నష్టం)రంగాలకు చెందిన సూచీలు తప్ప, అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. హిందూస్థాన్‌ యూనిలివర్‌, ఐటీసీ షేర్ల అండతో ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. మరో ప్రధాన ఇండెక్స్‌ బ్యాంక్‌ నిఫ్టీ 366 పాయింట్లు లాభపడి 26,365 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 34,896 - 35,397 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,490 - 10,637 స్థాయిలో ట్రేడైంది.
501 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
సానుకూల సంకేతాలతో స్టాక్‌మార్కెట్‌  ఈ వారం లాభాలతో ప్రారంభమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 3నెలలకు బలపడటం, అనుకూల అంతర్జాతీయ పరిణామాలు సూచీల లాభాల ప్రారంభానికి కారణమయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 35,118 వద్ద, నిఫ్టీ సూచీ 41 పాయింట్ల లాభంతో 10,568.30 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అయితే ఈ గురువారం ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ స్వల్పంగా కరిగిపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి. ఒక దశలో సెన్సెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో 34వేల దిగువకు, నిఫ్టీ సూచీ 10500 పాయింట్ల దిగువకు చేరుకున్నాయి. నష్టాల ట్రేడింగ్‌ సమయంలో హెవీవెయిటేజ్‌ షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐఐసీఐసీ బ్యాంకు, ఐటీసీ షేర్ల ర్యాలీకి సూచీలకు అండగా నిలిచాయి. మిడిసెషన్‌ అనంతరం ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, బ్రిటన్‌ బ్రెగ్జిట్‌ ప్రణాళికకు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపిందన్న వార్తలతో యూరోపియన్‌ మార్కెట్ల లాభాలు దేశీ సూచీలకు ఉత్సాహానిచ్చాయి. అలాగే డిసెంబర్‌ మధ్యలో ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.42వేల కోట్లను మూలధనాన్ని సమకూర్చుందనే వార్తలలో బ్యాంకింగ్‌ షేర్లలో ర్యాలీ మొదలైంది. మరోవైపు ఎఫ్‌ఎంజీసీ షేర్లు మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ లాభాల బాట పట్టాయి. ఎంఎఫ్‌జీసీ రంగంలోని హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేరు 4.50శాతం లాభపడి 3నెలల గరిష్టాన్ని అందుకుంది. చివరకు 4శాతం లాభంతో ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-3 స్థానంలో ముగిసింది. ఇదే రంగానికి చెందిన ఐటీసీ షేరు ట్రేడింగ్‌లో 2శాతం లాభపడి సూచీలకు ర్యాలీకి అండగా నిలిచింది. ఈ సానుకూలాంశాలతో నిఫ్టీ 10,628 వద్ద, సెన్సెక్స్‌ 35,354 వద్ద ముగిసింది.

ఏషియన్‌ పేయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌, విప్రో, హీరోమోటోకార్ప్‌ షేర్లు 2.50శాతం నుంచి 6శాతం లాభపడ్డాయి. కోల్‌ఇండియా, వేదాంత, యస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.You may be interested

హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే ముందు... ఒక్క నిమిషం

Tuesday 27th November 2018

వైద్య బీమా ప్రాధాన్యంపై సామాన్యుల్లోనూ అవగాహన పెరుగుతోంది. ఏటేటా వైద్య బీమా ప్లాన్‌ తీసుకునే సగటు మధ్యతరగతి వాసుల సంఖ్య వృద్ధి చెందుతోంది. చిన్న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినా బిల్లులు వేలల్లో, లక్షల్లో అవుతున్న తరుణంలో బీమా తీసుకోవడం ఆర్థికంగా ఒకింత భద్రతతో కూడిన చర్యే. అయితే, హెల్త్‌ ప్లాన్‌ తీసుకునే వారు ముఖ్యంగా గమనించాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని బ్యాంక్‌బజార్‌ సీఈవో ఆదిల్‌ శెట్టి తెలియజేశారు.    వేచి ఉండే కాలం ప్రతీ

వచ్చే 2 వారాల కోసం 7 సిఫార్సులు..

Monday 26th November 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల రిత్యా ఎంపిక చేసిన షేర్లను మాత్రమే చూడడం మంచిదని పలువురు టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తు‍న్నారు. జీ20 సదస్సు వంటి పరిణామాలతో పాటు టెక్నికల్‌ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే రెండు వారాల కోసం 7 సిఫార్సులను ప్రకటించారు. ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సిఫార్సులు బీఈఎంఎల్‌  | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్ ధరల శ్రేణి: రూ.810-830 | స్టాప్ లాస్‌: రూ.700 డాక్టర్ రెడ్డీస్ | సిఫార్సు: కొనొచ్చు ​| టార్గెట్

Most from this category