STOCKS

News


లాభాలు.. అంతలోనే నష్టాలు..

Friday 10th August 2018
Markets_main1533873982.png-19109

స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లోనే ప్రారంభమైంది. అయితే వెంటనే నష్టాలోకి జారిపోయింది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 38,024 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 38,050 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,471 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్ల లాభంతో 11,475 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డ్‌ స్థాయిలను తాకిన విషయం తెలిసిందే.
అమెరికా మార్కెట్లు గురువారం స్వల్పంగా తగ్గడం,  ఆసియా మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం, మార్కెట్‌ రెగ్యులేటర్‌​సెబీ తాజాగా 117 కేసులపై విచారణ జరపనుండటం, మ్యూచువల్‌ ఫండ్స్‌కు జూలై నెలలో 8.62 లక్షల ఇన్వెస్టర్‌ ఖాతాలు జతవ్వడం, ముడి చమురు ధరలు స్వల్పంగా క్షీణించడం, జీఎస్‌టీ సవరణకు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందటం,  రూపాయి గురువారం 5 పైసలు బలహీన పడి 68.68కి క్షీణించడం, 377 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించనుండటం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

నిఫ్టీలో ఐషర్‌ మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, యూపీఎల్‌, టైటాన్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఇక ఎస్‌బీఐ, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, రిలయన్స్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, గెయిల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెక్టోరల్‌ ఇండెక్స్‌లలో నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియల్టీ మినహా మిగతావన్నీ నష్టల్లోనే ఉన్నాయి.
 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 10th August 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు జీఎంఆర్‌ ఇన్ఫ్రా:- రూ.2950 కోట్ల నిధుల సమీకరణ ఆమోదం తెలపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- తొలి త్రైమాసిక ఫలితాల ప్రకటను వాయిదా వేసింది. ఐడీబీఐ బ్యాంకు:- కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన 12.50లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది. స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4శాతం వాటా ఉపసంహరించుకునేందుకు సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి అనుమతులు

ఆగని రికార్డుల హోరు

Thursday 9th August 2018

సూచీల మరో కొత్త రికార్డు ముగింపు  38వేల శిఖరంపైకి సెన్సెక్స్‌ ముంబై:- మార్కెట్‌లో సూచీల రికార్డు ర్యాలీ ఆగడం లేదు. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల అండతో రెండో రోజూ అటు ఇంట్రాడేలోనూ, ఇటు ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభపడి 38024 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 11,470 వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ తొలిసారి 38000 శిఖరాన్ని అధిరోహించి 38076 వద్ద తన జీవితకాల

Most from this category