STOCKS

News


35వేల దిగువకు సెన్సెక్స్‌

Thursday 22nd November 2018
Markets_main1542883662.png-22314

  • 10550 దిగువకు నిఫ్టీ
  • మార్కెట్‌కు మూడోరోజూ తప్పని నష్టాలు

ముంబై:- మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు దినాలు(శుక్రవారం గురునానక్‌ జయంతి, శని ఆదివారాలు సాధారణ సెలవు దినాలు), వచ్చేవారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు వారం కావడంతో కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అమ్మకాలకే మొగ్గుచూపారు. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో లార్జ్‌ క్యాప్‌ షేర్లు ఎక్కువగా నష్టపోగా నేటి ట్రేడింగ్‌ మిడ్‌క్యాప్‌ షేర్లు ఎక్కువగా క్షీణించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35వేల దిగువకు చేరుకుంది. నిప్టీ 10550 మార్కును కోల్పోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 34,938 - 35,364 రేంజ్‌లో కదలాడి చివరకి 219 పాయింట్ల నష్టపోయి చివరకు 34,981 వద్ద ముగిసింది. మరో ప్రధాన నిఫ్టీ సూచీ 10,512 - 10,646.25 స్థాయిలో ట్రేడై చివరకు 73 పాయింట్ల నష్టంతో 10,527 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ 26 మార్కును కోల్పోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ వారం సెటిల్‌మెంట్‌ కావడంతో పాటు, బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో నిఫ్టీ బ్యాంక్‌సూచీ 262 పాయింట్లు(1శాతం) నష్టపోయి 25,999 వద్ద ముగిసింది. జీ లిమిటెడ్‌ షేరు ర్యాలీతో మీడియా ఇండెక్స్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది.
427 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
అంతర్జాతీయ పరిణామాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 35,282 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,612 వద్ద ప్రారంభమైంది. డాలర్‌ మారకంలో రూపాయి ఏడో రోజూ బలపడటం, హెవీవెయిట్‌ కలిగిన ఐటీ షేర్ల రీకవరీ, ఇంధన షేర్ల ర్యాలీతో తదితర సానుకూలాంశాలతో సూచీలు మిడ్‌ సెషన్‌ వరకు ఓ మోస్తారుగా లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 164 పాయింట్లు లాభపడి 35364 వద్ద  నిఫ్టీ 46పాయింట్లు లాభపడి 10646 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి కష్టాలు మొదలయ్యాయి. మిడ్‌సెషన్‌ అనంతరం సూచీలకు ప్రపంచమార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్తబ్దుగా ట్రేడైన ఆసియా మార్కెట్లు నష్టాల ముగింపు, టెక్‌, మైనింగ్‌ షేర్ల పతనంతో యూరప్‌ మార్కెట్లు నష్టాల ప్రారంభ ప్రభావంతో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింది. మరోవైపు దేశీయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు దినాలు రావడం, వచ్చేవారం ఎంఅండ్‌ఓ ముగింపు కావడం తదితర అంశాలు సూచీలను నష్టాల వైపు నడిపించాయి. మార్కెట్‌ ముగింపు వరకు అమ్మకాలు కొనసాగడంతో చివరకు సెన్సెక్స్‌ 34,981.02 వద్ద, నిఫ్టీ 10,527 వద్ద ముగిసింది.

ఐఓసీ, బజాజ్‌ఫైనాన్స్‌, హిందాల్కో, గ్రాసీం, ఎంఅండ్‌ఎం షేర్లు 2.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ, అదానీ ఫోర్ట్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు అరశాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఐషర్‌ మోటార్స్‌ టార్గెట్‌ తగ్గించిన ఇన్వెస్టెక్‌

Thursday 22nd November 2018

ముంబై: ఐషర్‌ మోటార్స్‌ లిమిటెడ్ షేరు ధర గురువారం ఒక శాతం మేర నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.23,940 కనిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.161 (0.67 శాతం) నష్టపోయి రూ.24,055 వద్ద ముగిసింది. ఈ కంపెనీ షేరు ధరను ఇంతకుముందు ఇచ్చిన టార్గెట్‌ రూ.35,000 నుంచి రూ.30,300 వద్దకు తగ్గిస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ ఇన్వెస్టెక్‌ ప్రకటించింది. ప్రస్తుత ధర నుంచి 13.4 శాతం తగ్గించింది. 2019/20 ఆర్థిక సంవత్సరానికి

ఇండియన్‌ హోటల్స్‌ టార్గెట్‌ రూ.163

Thursday 22nd November 2018

ముంబై: ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ షేరు ధర గురువారం ఒకదశలో 9 శాతం లాభపడింది. ఇంట్రాడేలో రూ.143 వద్ద గరిష్టస్థాయిని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయానికి రూ.3.45 (2.56 శాతం) లాభపడి రూ.138 వద్ద ముగిసింది. ఈ స్థాయి నుంచి షేరు ధర 20 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్ తన అంచనాను వెల్లడించింది. హోటల్‌ పరిశ్రమ ఆక్యుపెన్సీ 67 శాతానికి చేరుకుని తగిన

Most from this category