STOCKS

News


39000 పైన ముగిసిన సెన్సెక్స్‌

Wednesday 24th April 2019
Markets_main1556101734.png-25318

చివరి గంటలో కొనుగోళ్లతో భారీ లాభపడ్డ సూచీలు
మూడురోజుల వరుస నష్టాలకు బ్రేక్‌
150 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

గత మూడు రోజులుగా భారీగా పతనమైన మార్కెట్లో కనిష్టస్థాయి వద్ద చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు, ఏప్రిల్‌ డెరివేటివ్‌ సిరీస్‌ మరో రోజులో ముగియనున్న నేపథ్యంలో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 489 పాయింట్ల లాభంతో 39,054.68 వద్ద, నిఫ్టీ 150.20 పాయింట్లు పెరిగి 11,726.15 వద్ద స్థిరపడ్డాయి. దీంతో మార్కెట్ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పడినట్లైంది.  పలు కంపెనీలు క్యూ4 ఫలితాల ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఒక్క అటో రంగ షేర్లలో తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లూ పెరిగాయి. గతరాత్రి అమెరికా ప్రధాన సూచీలు నాస్‌డాక్‌ రికార్డుస్థాయి వద్ద, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ కొత్తరికార్డుస్థాపనకు మరో 5 పాయింట్ల దూరంలో ముగియడంతో అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది.   సెన్సెక్స్‌ 107 పాయింట్లు లాభంతో 38564.88 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 11601 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభం నుంచి అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జిస్తూ వచ్చాయి. మిడ్‌సెషన్‌ సమయానికి యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో పాటు చివరి గంటలో కొనుగోళ్ల జోరుగా సాగడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 530 పాయింట్లను ఆర్జించి 39095.35ల వద్ద, నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 11741 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నెలకొల్పాయి.
ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌టెక్‌, బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు 3శాతం నుంచి 5.50శాతం లాభపడగా, సిప్లా, కోల్‌ఇండియా, మారుతి, హీరోమోటోకార్ప్‌, టాటామోటర్స్‌ షేర్లు అరశాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

నిఫ్టీ ట్రేడింగ్‌ రేంజ్‌ మారింది!

Wednesday 24th April 2019

ఇప్పటివరకు 11550- 11750 పాయింట్ల మధ్యన కదలాడుతున్న నిఫ్టీ రేంజ్‌ ప్రస్తుతం పైవైపునకు జరిగిందని బుధవారం ట్రేడింగ్‌ అనంతరం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ 11600- 11800 పాయింట్లకు మారిందని, ఇందుకు తగ్గట్లే నిఫ్టీ 11600 పాయింట్ల నుంచి బలంగా బౌన్సైందని చెబుతున్నారు. మంగళవారం ఇంట్రాడేలో నిఫ్టీ 11560 పాయింట్లను టచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయిల వద్ద నిఫ్టీలో కొనుగోళ్లు కనిపించాయి. ఈ రోజు చివర్లో

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌ జంప్‌

Wednesday 24th April 2019

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర ఆరునెలల గరిష్టస్థాయిలను రికవరీ కావడంతో బుధవారం ట్రేడింగ్‌లో పెట్రోరంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. బీఎస్‌ఈలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఎన్‌అండ్‌పీ బీఎస్‌ఈ అయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యే ముడిచమురు మీద అగ్రరాజ్యమైన అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆరునెలల గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

Most from this category