News


బేర్‌మన్న బ్యాకింగ్‌ షేర్లు

Tuesday 23rd October 2018
Markets_main1540285026.png-21407

మిడ్‌సెషన్‌ సమయంలో మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాకింగ్‌ రంగషేర్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2శాతం, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1శాతం, నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 1శాతం క్షీణించాయి.

  • ప్రభుత్వరంగ షేర్లలో అత్యధికంగా ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. సిండికేట్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనమయ్యాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు విజయా బ్యాంక్‌, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ -1.50శాతం నష్టంతో 2,635.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
  • ప్రైవేట్‌ రంగ షేర్లు అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకు 2.50శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, సౌత్‌ ఇండియా బ్యాంక్‌ 2శాతం పతనమయ్యాయి. ఫెడరల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యస్‌ బ్యాంక్‌ కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1నుంచి అరశాతం నష్టపోయాయయి. ఒక్క ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 1శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ -1.00శాతం నష్టంతో 14,034.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
  • మరో ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 2శాతం నష్టపోయింది. ఈ సూచీలో భాగమైన మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ -1.00శాతం నష్టంతో 24,844.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

భగ్గుమన్న బంగారం ధర

Tuesday 23rd October 2018

ప్రపంచ మార్కెట్లో పసిడి ధర మంగళవారం పరుగులు పెడుతోంది. నేడు యూరప్‌ ఔన్స్‌ పసిడి ఏకంగా 19 డాలర్లు లాభపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో  అమ్మకాల సునామి నెలకొంది. ఫలితంగా అటు ఆసియా మార్కెట్లతో సహా యూరప్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు డాలర్‌ మారకంలో యెన్‌ విలువ బలపడింది. సౌది అరేబియా, పాశ్చత్య దేశాల మధ్య ముదిరిన రాజకీయ

‘వ్యాల్యు’ చేకూర్చే స్టాక్స్‌ ఇవే..

Tuesday 23rd October 2018

మార్కెట్‌ నిపుణులు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో 10 స్టాక్స్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. అవేంటో చూద్దాం..  అనలిస్ట్‌: స్టీవెన్‌ బిర్చ్‌ (విలియమ్‌ ఓనీల్‌, ప్రెసిడెంట్‌) సిప్లా: ఫండమెంటల్స్‌ మెరుగవుతున్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో ఎర్నింగ్స్‌లో రెండంకెల వృద్ధి నమోదు కావొచ్చు. దేశీ, ఆఫ్రికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి స్టాక్‌కు సానుకూల అంశం. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నికల్‌గా చూసినా కూడా ఈ స్టాక్‌ పాజిటివ్‌గానే కనిపిస్తోంది. 200 రోజుల లైన్‌కు పైన

Most from this category