News


10శాతం కరెక‌్షన్‌ వుండొచ్చు

Saturday 15th September 2018
Markets_main1537009359.png-20294

ముంబై:-  మార్కెట్లో10శాతం వరకూ కరెక‌్షన్‌ ఉండొచ్చని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ స్థితిగతులు, భారీగా క్షీణిస్తున్న రూపాయి పతన ప్రభావం మన మార్కెట్‌పై ఎంతవరకు ఉండవచ్చన్న అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఒక ఆంగ్లచానల్‌లో వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వ్యవస్థలో నెలకొన్న స్థూల ఆర్థిక సవాళ్లను ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు...
ప్రశ్న:- రూపాయి పతనం మార్కెట్‌ వర్గాలకే కాకుండా, ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి అవుట్‌లుక్‌ ఎలా ఉంటుంది?
జవాబు:- కరెంట్‌ అకౌంట్‌ ద్రవ్యలోటు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డాలర్‌ ద్రవ్యత్వ కొరత... ఈ రెండు అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో డాలర్‌ మారకంలో రూపాయి మరింత బలహీనపడి 73 నుంచి 74కు చేరవచ్చని మేము అంచనా వేస్తున్నాము.
ప్రశ్న:- సెన్సెక్స్‌, నిఫ్టీ తమ జీవితకాల గరిష్టాలకు వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే కొందరు మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం మార్కెట్లో మరో 10శాతం కరెక‌్షన్‌ తప్పదని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం..?
జవాబు:- మార్కెట్‌ 10శాతం లేదా అంతకంటే ఎక్కువగా పతనం అవుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకు దేశీయంగానూ, అంతర్జాతీయంగా పలు ప్రతికూలాంశాలు నెలకొన్నాయి. మొదటిది స్థూల ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ ద్యవ్యలోటు, బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల మార్కెట్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. వీటికి తోడు పరోక్ష​ పన్నుల వసూళ్లు తగ్గడం, మరోవైపు ప్రపంచ ఆర్థికవ్యవస్థలో  నెలకొన్న బలహీన పరిస్థితులు దేశీయ మార్కెట్‌లోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని తగ్గిస్తున్నాయి. రెండోది ఆదాయ వృద్ధి దేశీయ మార్కెట్‌కు ప్రధాన సమస్యగా మారింది. గత రెండు ఏళ్ల నుంచి మార్కెట్‌ ఆదాయ వృద్ధి బలహీనంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మార్కెట్‌ ఆదాయ వృద్ధి(పీఎస్‌యూ బ్యాంక్‌ మినహాయించి) 20శాతానికి మాత్రమే  పరిమితమైంది. అయితే అధిక ఆదాయ వృద్ధి మార్కెట్లో ఉన్న ఇతర ప్రతికూల అంశాలను అధిగమించవచ్చు. మూడోది... అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతల కారణంగా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నత్తనడకన సాగుతోంది. భారీగా ర్యాలీ చేస్తున్న అమెరికా మార్కెట్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గరిష్టస్థాయికి చేరుకుందనే అంశాన్ని సూచిస్తుంది. డాలర్‌ ద్రవ్యలోటు కారణంగా పలు వర్థమానదేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో పాటు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం తీవ్రతరమవుతోంది. పై మూడు అంశాలు మార్కెట్‌ 10శాతం పతనానికి కారణం కావొచ్చు.
ప్రశ్న:- రూపాయి పతనం ఇండియా కంపెనీలపై ఎంతమేరకు ఉంటుంది...?
జవాబు:- రూపాయి పతనం కేవలం కంపెనీలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆర్థిక గణాంకాలపై ప్రభావితం చూపుతోంది. మన దేశ కంపెనీలకు విదేశీ రుణాల కొరత ఏర్పడుతుంది. అలాగే విదేశీ సేవలను పొందేందుకు కంపెనీలు అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ముడిసరుకుల దిగుమతిపై ఆధారపడే కంపెనీలపైనా ఈ ప్రభావం ఉంటుంది. ముడి సరుకుల మీద కంపెనీలు చేసే వ్యయాలు కొన్ని త్రైమాసికాల పాటు​ కంపెనీల మార్జిన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఇక రూపాయి పతనంతో కరెంట్‌ అకౌంట్‌ ద్రవ్యలోటు పెరిగి ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. డాలర్‌ ద్రవ్యత్వలోటు మార్కెట్‌లోకి ఎఫ్‌పీఐ, ఎఫ్‌డీఐ నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. తైమాసికాల్లో విదేశీ పెట్టుబడులు మరింత తగ్గవచ్చు. ప్రభుత సేవల రంగంలో దిగుమతిపై ఆధారపడే కంపెనీలపై రూపాయి పతన ప్రభావం ఉంటుంది.
ప్రశ్న:- రూపాయి పతనం ఐటీ, ఫార్మా కంపెనీ షేర్లకు మంచిదని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. రూపాయి కొత్త కనిష్టాలకు చేరుతున్న ఈ తరుణంలో ఈ రంగాలకు చెందిన అన్ని షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయా..?
జవాబు:- ఫార్మా రంగం ఇప్పటి వరకైతే మంచి లాభాలనే పంచుతుంది. అయితే ఇందుకు రూపాయి పతనం మాత్రమే కారణం కాదు.. నియంత్రణ
సంస్థల సానుకూల దృక్పథం కూడా ఉందనే అంశాన్ని మరిచిపోకూడదు. ఇక రూపాయి పతనం ఐటీ రంగంలో షేర్లకు కూడా కలిసి వస్తుంది. అయితే ఈ రంగంలో ప్రస్తుత స్థాయిల వద్ద కొన్ని షేర్లు అధిక వాల్యూవేషన్స్‌ వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. కాబట్టి ఎంపిక చేసిన ఐటీ షేర్లను మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం.

పశ్న:- ప్రస్తుతం మార్కెట్లో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు చేస్తుంటే, వారి అమ్మకాలను దేశీయ రిటైల్‌ ఇన్వెస్టర్లు  తీసుకుంటున్నారు.  ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని భావించవచ్చా..?
జవాబు:- దేశీయ మార్కెట్లోకి డీఐఐ నిధుల ప్రవాహం నిధానంగా తగ్గుముఖం పడుతోంది. దేశీయమార్కెట్‌లో గత ఏడాది(2017) చివర్లో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు గరిష్టంగా ఒకే నెలలో రూ.17వేల కోట్ల పెట్టుబడులు పెట్టగా, ఈ ఏడాది ఆగస్ట్‌ లో ఇంకా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయి. సిప్‌,మ్యూచువల్‌ ఫండ్స్‌లో నిధుల ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఎఫ్‌పీఐల కొనుగోళ్లను చూస్తే వారి ఇప్పటికి అమ్మింది పెద్ద విషయమే కాదు. ఈ నేపథ్యంలో గత కొద్ది త్రైమాసికాల్లో కంటే ఈ త్రైమాసికంలో నిధుల ప్రవాహం తక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాం.You may be interested

ఉపశమించిన వాణిజ్యలోటు

Saturday 15th September 2018

భారత వాణిజ్యలోటు ఆగస్టులో కాస్త తగ్గింది. అంతకుముందు ఐదేళ్ల గరిష్టానికి చేరిన వాణిజ్యలోటు ఆగస్టులో దిగివచ్చి 1739 కోట్ల డాలర్లకు చేరింది. జూలైలో ఈ లోటు 1800 కోట్ల డాలర్లుగా నమోదయిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టులో వాణిజ్యలోటు 1272 కోట్ల డాలర్లుగా ఉంది. రూపీలో రీబౌండ్‌ కనిపించి, బాండ్‌ ఈల్డ్స్‌ చల్లబడ్డ తరుణంలో వాణిజ్యలోటు కాస్త ఉపశమించడం ప్రభుత్వానికి ఊరటనిచ్చేఅంశంగా నిపుణులు భావిస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే ఈ ఆగస్టులో మొత్తం

కలిసివచ్చిన కరెక‌్షన్‌!

Saturday 15th September 2018

మార్కెట్లో చెత్తంతా పోయింది సంజీవ్‌ భాసిన్‌ మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌తో చాలా చెత్త కొట్టుకుపోయిందని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా పతనంతో సూచీల్లో ఆషామాషీ ఆటగాళ్లు మాయమై, నిజమైన పెట్టుబడిదారులే మిగులుతారని చెప్పారు. వచ్చే వారం వర్ధమాన మార్కెట్లన్నీ బలమైన రీబౌండ్‌ చూపే అవకాశాలున్నాయన్నారు. డాలర్‌ దిగిరావచ్చని అంచనా వేశారు. అక్టోబర్‌లో అమెరికా సూచీలు మరో కొత్త గరిష్ఠం నమోదు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయ సూచీలు సైతం అక్టోబర్‌లో

Most from this category