STOCKS

News


ఏప్రిల్‌ నాటికి నిఫ్టీ@12,000!

Thursday 31st January 2019
Markets_main1548930262.png-23931

సంజీవ్‌ భాసిన్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌
ఫిబ్రవరిలో నిఫ్టీ 11000- 11200 పాయింట్ల వరకు, ఏప్రిల్‌నాటికి దాదాపు 12,000 పాయింట్ల వరకు దూసుకుపోవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. కొన్ని కంపెనీల ఫలితాలు పేలవంగా ఉన్నా, కొన్ని నెగిటివ్‌ వార్తలు చుట్టుముట్టినా ఇవన్నీ రాబోయే బుల్‌ర్యాలీలో సమసిపోతాయన్నారు. ఏప్రిల్‌ నాటికి కొత్త గరిష్ఠాలను చూస్తామని అభిప్రాయపడ్డారు. ఈ దఫా ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌, కొన్ని పీఎస్‌యూ కంపెనీలు మంచి ప్రదర్శన చూపుతాయని తెలిపారు. ఏప్రిల్‌లో దాదాపు 500- 700 పాయింట్ల ర్యాలీ కనిపిస్తుందన్నారు. అంతర్జాతీయంగా డౌజోన్స్‌ కూడా ర్యాలీ బకాయి పడిందని, డాలర్‌ త్వరలో బలహీనపడుతుందని తెలిపారు.

యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ 2.68 శాతానికి చేరడం చూస్తే ఫెడ్‌ తన పంథా మార్చుకొని రేట్లను పెంచకుండా ఆగవచ్చని అంచనా వేశారు. ఇదే నిజమైతే వర్ధమాన మార్కెట్లకు చాలా మేలన్నారు. దీనికితోడు బడ్జెట్లో పన్ను పరిమితులు తగ్గించడం లాంటి చర్యలు, ఆర్‌బీఐ రేట్లను తగ్గించే వరుస మొదలుపెట్టడం వంటివి మన మార్కెట్లను మరింత ముందుకు తీసుకుపోతాయని చెప్పారు. ఇదే సమయంలో రూపాయి బలపడి, ఎఫ్‌ఐఐలు తిరిగి భారత్‌వైపు రావడం జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాజిటివ్‌ మార్పులన్నీ ఫిబ్రవరి నుంచే కనిపిస్తాయని చెప్పారు.

ఐటీ రంగంలో మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌టెక్‌, విప్రో షేర్లపై పాజిటివ్‌గా ఉన్నామని చెప్పారు. ఎన్నికల అనంతరం రియల్టీ రంగంలోని షేర్లలో జోష్‌ వచ్చే ఛాన్సులున్నాయని తెలిపారు. ఈ రంగంలో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని చెప్పారు. బంగారంపై బేరిష్‌గా ఉన్నామని సంజీవ్‌ తెలిపారు



You may be interested

ఏయే షేర్లు...ఎన్నెన్ని పాయింట్లు.?

Thursday 31st January 2019

హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ కారణంగా గురువారం భారత్‌ మార్కెట్‌ పెద్ద ర్యాలీ జరిపింది. నిఫ్టీ ఇండెక్స్‌ ఆర్జించిన 179 పాయింట్ల లాభంతో రిలయన్స్‌ ఇండస్ట్రీట్‌ లిమిటెడ్‌ షేరు అత్యధికంగా 27 పాయింట్లను సమకూర్చింది. అదే బాటలో ఇన్ఫోసిస్‌ 21 పాయిం‍ట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 16 పాయింట్లను హెచ్‌డీఎఫ్‌సీ 14 పాయింట్లను, ఐటీసీ షేరు 11పాయింట్ల, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 10పాయింట్లను అందజేశాయి. అలాగే టీసీఎస్‌,

సెన్సెక్స్‌ 665 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు జంప్‌

Thursday 31st January 2019

-బ్యాంక్‌, ,ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు నేతృత్వం -బడ్జెట్‌పై పెరిగిన అంచనాలు -ప్రపంచ మార్కెట్లకు ఫెడ్‌ ఊపు   పలు సానుకూల అంశాలు, బడ్జెట్‌పై మెరుగుపడిన అంచనాల ప్రభావంతో గురువారం భారత్‌ మార్కెట్‌ భారీ ర్యాలీ జరిపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 665 పాయింట్లు పెరిగి 36,256 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 179 పాయింట్లు లాభపడి 10,831 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగు రోజుల గరిష్టస్థాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్‌కు రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన

Most from this category