STOCKS

News


11800 పాయింట్లకు నిఫ్టీ!

Wednesday 8th August 2018
Markets_main1533708144.png-19045

యస్‌ సెక్యూరిటీస్‌ అంచనా
గతవారం ర్యాలీ అనంతరం ఈ వారం సూచీలు మందకొడిగా సాగుతున్నాయి. బుధవారం నిఫ్టీ మరో రికార్డు స్థాయిని తాకినా మెజార్టీ షేర్లలో కదలికలు లేవు. నిఫ్టీ క్రమంగా ట్రేడింగ్‌ ఛానెల్‌ పైఅవధి 11500 పాయింట్ల దిశగా కదులుతోంది. నిఫ్టీ ఈ స్థాయిని దాటి 11530 పాయింట్ల పైన స్థిరంగా కొనసాగితే త్వరలో 11800 పాయింట్లను చేరుకుంటుంది. ఒకవేళ 11270 పాయింట్ల మద్దతు కోల్పోతే మాత్రం క్రమంగా 11170- 11050 పాయింట్ల వరకు పతనమవుతుంది. డైలీ చార్టుల్లో ఆర్‌ఎస్‌ఐ సూచీ లో హైని ఏర్పరచగా, ప్రైస్‌ కొత్త హైని తాకింది. దీన్ని బట్టి అప్‌మూవ్‌లో శక్తి క్షీణిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మైనర్‌ కరెక‌్షన్‌ లేదా కన్సాలిడేషన్‌కు అవకాశాలున్నాయి. అనంతరమే మరోమారు ర్యాలీ ఛాన్సులుండొచ్చు.
స్వల్పకాలానికి మూడు షేర్లు:
1. హట్సన్‌ ఆగ్రో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 815. స్టాప్‌లాస్‌ రూ. 650. వీక్లీ చార్టుల్లో బ్రేకవుట్‌కు రెడీగా కనిపిస్తోంది. రూ. 720 స్థాయిని దాటి స్థిరంగా ట్రేడవుతే బ్రేకవుట్‌ను నిర్ధారించుకోవచ్చు. డైలీ చార్టుల్లో హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పరుస్తూ పాజిటివ్‌ ట్రెండ్‌ చూపుతోంది. ఆర్‌ఎస్‌ఐ బుల్స్‌కు అనుకూలంగా మారింది.
2. కోల్గేట్‌ పామోలివ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1270. స్టాప్‌లాస్‌ రూ. 1100. వారం చార్టుల్లో ఛానెల్‌పాటర్న్‌ ఛేదించి అప్‌ట్రెండ్‌ కొనసాగింపు సూచనలు ఇచ్చింది. రూ. 1150కి పైన ట్రేడవుతే ర్యాలీ కొనసాగుతుంది. డైలీ చార్టుల్లో బ్రేకవుట్‌సాధించింది. ఆర్‌ఎస్‌ఐ డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకొని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది.
3. టీవీఎస్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 625. స్టాప్‌లాస్‌ రూ. 510. డైలీ చార్టుల్లో వెడ్జ్‌ పాటర్న్‌ను ఛేదించుకుని పైకి పరుగుతీసే సన్నాహాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. పాజిటివ్‌ రివర్సల్‌ అవకాశాలున్నాయి. ఇండికేటర్లు బుల్లిష్‌గా మారాయి. 



You may be interested

ఈ వారంలో 11500 పక్కా!

Wednesday 8th August 2018

నిఫ్టీపై ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా ఈ వారాంతానికి నిఫ్టీ 11500 పాయింట్లను చేరవచ్చని ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో షార్ట్‌ పొజిషన్లు చాలా ఉన్నాయని డెరివేటివ్స్‌ డేటా చెబుతోందని తెలిపింది. అందువల్ల మరోదఫా షార్ట్‌ కవరింగ్‌ను ఊహించవచ్చని పేర్కొంది. మరో షార్ట్‌ కవరింగ్ వస్తే నిఫ్టీ 11500- 11550 పాయింట్ల వరకు చేరవచ్చని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీకి 11200- 11300 పాయింట్ల వద్ద పలు మద్దతులున్నాయని

ట్రేడ్‌వార్‌తో పసిడి పరుగు

Wednesday 8th August 2018

ముంబై:- అమెరికా - చైనాల మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న తరుణంలో పసిడి ధర పుంజుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర బుధవారం భారత కాలమానం ప్రకారం గం.10:45 ని.లకు 3.40 డాలర్లు పెరిగి 1,221.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆగస్ట్‌ 23 నుంచి 16 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తామని మంగళవారం అమెరికా మరోసారి ప్రకటించింది. ఇక పసిడిపై

Most from this category