News


ఎన్నికల ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 15th January 2019
Markets_main1547547038.png-23608

యూబీఎస్‌ సూచనలు
త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న వేళ మార్కెట్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు వెనకాముందాడుతున్నారు. ఎన్నికల వేళ ప్రభుత్వం పాపులర్‌ విధానాలవైపు మొగ్గు చూపవచ్చన్న అంచనాలున్నాయి. ఎన్నికల అనంతరం ఎలాంటి ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వాన్ని బట్టి నిఫ్టీ ఎలా స్పందిస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే ఏ రంగాలను ఎంచుకొని ట్రేడ్‌ చేయాలనే అంశాలపై ఇన్వెస్టర్లకు పలు సందేహాలున్నాయి. ఈ సందేహాలకు యూబీఎస్‌ సమాధానమిస్తోంది.


సీన్‌1: బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం: ఇన్వెస్టర్లు యథాతధంగా ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ ఆధారంగా రేట్‌సెన్సిటివ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్స్‌, కార్పొరేట్‌ లెండింగ్‌ బ్యాంక్స్‌, ఆటో, కన్జూమర్‌, ఎన్‌బీఎఫ్‌సీ, ప్రాపర్టీ, ఆయిల్‌, ఎస్‌ఎంఐడీ రంగాలకు పాజిటివ్‌. ఐటీ, ఫార్మాకు నెగిటివ్‌.
సీన్‌2: బీజేపీ ఆధ‍్వర్యంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడం. కన్జూమర్‌, ఐటీ రంగాలకు పాజిటివ్‌. ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్స్‌కు నెగిటివ్‌.
సీన్‌3: కాంగ్రెస్‌ ఆధ్వర‍్యంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచడం: ప్రైవేట్‌ బ్యాంకులు, ఐటీ కంపెనీలకు పాజిటివ్‌. ఎన్‌బీఎఫ్‌సీలు, ఎస్‌ఎంఐడీలకు నెగిటివ్‌.
సీన్‌4: మూడో ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు. కన్జూమర్‌, ఐటీ రంగాలకు పాజిటివ్‌. ఇన్‌ఫ్రా, ఇండస్ట్రియల్స్‌, ఎస్‌ఎంఐడీలకు నెగిటివ్‌.
నిఫ్టీ టార్గెట్లు


సీన్‌1: బీజేపీకి పూర్తి మెజార్టీ. ఏడాది చివరకు నిఫ్టీ 11900 పాయింట్లను చేరవచ్చు. నిఫ్టీ శ్రేణి: 10000- 11900 పాయింట్లు.
సీన్‌2: బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం. ఏడాది చివరకు నిఫ్టీ 11300 పాయింట్లను చేరవచ్చు. నిఫ్టీ శ్రేణి: 9400- 11300 పాయింట్లు.
సీన్‌3: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం: మార్కెట్లు డీరేట్‌ కావచ్చు. నిఫ్టీ శ్రేణి: 8800- 11300 పాయింట్లు.
సీన్‌4: థర్డ్‌ఫ్రంట్‌ ప్రభుత్వం: డీరేటింగ్‌ తప్పదు. నిఫ్టీ శ్రేణి: 8200- 10000 పాయింట్లు. 

 



You may be interested

స్వల్పలాభంతో ప్రారంభం

Wednesday 16th January 2019

మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ దేశీయ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 36320 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 10,899 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసగా రెండోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. నిన్న బ్రిటన్‌ పార్లమెంట్‌లో బ్రిగ్జిట్‌ పై జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది,  202 మంది అనుకూలంగా ఓటు వేశారు. అలాగే అమెరికా

10850 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 15th January 2019

465 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ పటిష్టమైన ఆర్థిక గణాంకాల నమోదుతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. డిసెంబర్‌లో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బం తగ్గుముఖం పట్టడంతో రానున్న రోజుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉండవచ్చనే అంచనాలు సూచీలను పరుగులు పెట్టించాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ తిరిగి 71స్థాయిని అందుకోవడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌,

Most from this category