STOCKS

News


2019లో ఏ రంగాలు ర్యాలీ చేయవచ్చు..?

Monday 31st December 2018
Markets_main1546278474.png-23337

దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2018లో ఆటుపోట్లతో కొనసాగాయి. చివరి సెషన్‌ కూడా ఒడిదుడుకుల మయంగానే సాగింది. మొత్తం మీద 2018లో నిఫ్టీ కేవలం 3.15 శాతం రాబడులను ఇచ్చింది. మరి 2019 ఎలా ఉండబోతుంది...? ఏ రంగాలు ర్యాలీ చేయనున్నాయనే అంశాలను జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలియజేశారు.

 

18 రంగాల్లో 13 రంగాలు నష్టాలనే మిగిల్చాయి. రియాలిటీ, మీడియా, ఆటో సూచీలు వరుసగా 33 శాతం, 26 శాతం, 23 శాతం చొప్పున నష్టాలతో దిగువన ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచీలు మంచి లాభాలను ఇచ్చాయి. వీటిల్లో ఐటీ రంగ సూచీ 24 శాతం, ఎఫ్‌ఎంసీజీ 14 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 10.6 శాతం లాభాలను నమోదు చేశాయి. మరి 2019లో... స్టాక్‌ వారీగా గమనం ఉంటుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లలో అస్థిరతలు కొనసాగుతాయి. వినియోగం, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బ్యాంకు నిఫ్టీల్లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది. వీటి ఆర్‌ఎస్‌ దీన్ని నిర్ధారిస్తోంది. 50వారాల సగటు గమనంపైనే వీటి ఆర్‌ఎస్‌ లైన్‌ ఉన్నాయి. ఇది మెరుగైన పనితీరు కొనసాగుతుందని తెలియజేస్తోంది. ఫార్మా, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ బ్యాంకుల దీర్ఘకాలిక డౌన్‌ట్రెండ్‌ ముగిసింది. ఈ రంగాలన్నీ మార్కెట్‌తో పోలిస్తే 2019లో మెరుగైన పనితీరు చూపించొచ్చు. 



You may be interested

కొత్త సంవత్సరంలో శుభారంభం

Tuesday 1st January 2019

సెన్సెక్స్‌ 93 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్లు అప్‌ కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్‌ రోజైన మంగళవారం మార్కెట్‌ శుభారంభాన్నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 36,162 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, నిఫ్టీ 19 పాయింట్ల పెరుగుదలతో 10,882 పాయింట్ల వద్ద మొదలయ్యింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 0.5 శాతం పైగా పెరగడంతో పాటు ఆటోమొబైల్‌ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్లు పాజిటివ్‌గా మొదలయ్యాయి. భారతి

2019 కోసం బోటమ్‌అప్‌ విధానం: పొరింజు

Monday 31st December 2018

గత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి మార్కె్‌ట్‌ విలువ కలిగిన కంపెనీలు ఎక్కువగా నష్టపోయాయి. అయితే, ఇవి 2019లో మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ సీఈవో పొరింజు వెలియాత్‌. నూతన సంవత్సరంలో ఏ తరహా విధానం అనుసరణీయమన్నది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాలు...    ‘‘చాలా మంది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇరుక్కుపోయామని, బ్లూచిప్‌

Most from this category