STOCKS

News


ట్రేడింగ్‌ వేళల పెంపుపై ఏకాభిప్రాయం కీలకం

Saturday 8th September 2018
Markets_main1536346052.png-20065

ప్రధాన స్టాక్‌ ఎక్సేంజీల ట్రేడింగ్‌ వేళల్ని అర్ధరాత్రి వరకు పెంచాలన్న ప్రతిపాదనను బ్రోకర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సెబీ కోరుతోంది. మరోసారి బ్రోకర్లతో ఇదే అంశంపై చర్చించాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలను సెబీ కోరింది. ట్రేడింగ్‌ వేళలను పెంచడం అన్నది ఏకాభిప్రాయం మేరకు ఉండాలని, ఇందుకు వారి అభిప్రాయాలు కీలకమన్నది సెబీ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

 

బ్రోకర్లు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు ఒకే తాటిపైకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సెబీ యోచిస్తోంది. ట్రేడింగ్‌ వేళల పొడిగింపు అన్నది అన్ని స్టాక్స్‌కా లేక సూచీలకే పరిమితం చేయాలా అన్నది కూడా సమీక్షించనుంది’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 1 నుంచి ట్రేడింగ్‌ వేళలను పెంచే ప్రణాళికలను ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు ఇప్పటికే సెబీకి సమర్పించాయి. ట్రేడింగ్‌ వేళలను అర్ధరాత్రి 11.55 వరకు పెంచుకునేందుకు సెబీ ఈ ఏడాది మే 4న అమోదం తెలియజేసిన విషయం తెలిసిందే. తుది ఆమోదం తెలియజేసే ముందు బ్రోకర్లను సైతం సంప్రదించాలని సెబీ భావిస్తోంది. అదనపు ట్రేడింగ్‌ వేళలతో పెరిగే ఆదాయం కంటే వ్యయాలే అధికంగా ఉంటాయని, దీనిపై సెబీ సంప్రదింపులు చేయడం మంచిదని చురివాలా సెక్యూరిటీస్‌ ఎండీ అలోక్‌ చురివాలా పేర్కొన్నారు. భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు అన్నది బాధ్యత కలిగిన అన్ని సంస్థలు అనుసరించే నిబంధన అని, ట్రేడింగ్‌ వేళల పెంపు విషయంలో దీన్ని అనుసరించడం పట్ల సంతోషంగా ఉందని బోంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ బ్రోకర్ల ఫోరం చైర్మన్‌ ఉత్తమ్‌ బాగ్రి అన్నారు. 



You may be interested

భిన్నమైన ఈ ఫార్మా కంపెనీలే నయం: దీపేన్‌ మెహతా

Saturday 8th September 2018

పెద్ద ఫార్మా కంపెనీలకు బదులు భిన్నమైన వ్యాపార నమూనా కలిగిన ఫార్మా కంపెనీలను పెట్టుబడుల కోసం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు మెహతా సూచించారు. పెట్టుబడుల కోసం ఆయన పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సువెన్‌, దివిస్‌ ఫార్మా కంపెనీలను సూచించారు. అలాగే, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ సైతం మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ బెట్‌గా పేర్కొన్నారు.   బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ ‘‘ఈ కంపెనీలో మాతోపాటు, మా క్లయింట్లు కూడా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నారు. ఈ కంపెనీకి ఉన్న విభిన్నమైన వ్యాపార నమూనా

స్టాక్‌ మార్కెట్లో సంపాదించడం ఈజీయేనా..?!

Saturday 8th September 2018

స్టాక్‌ మార్కెట్‌ అన్నది కష్టమైన రీతిలో సులభమైన డబ్బులను సంపాదించుకునే వేదిక అని కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. అయితే, ప్రపంచ స్థాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉందని ఎవరైనా ఈ విధంగా భావించడం సరికాదని సూచించారు. ‘‘అక్కడ ఎటువంటి గ్యారంటీ ఉండదు. నేను ఎంతో మంది విజయం సాధించిన సీఏలు, సీఈవోలను కలుసుకున్నాను. వారు తమ తమ రంగాల్లో ఎంతో విజయం సాధించిన వారు. ఎన్నో

Most from this category