STOCKS

News


స్టార్టప్‌ నిబంధనలు సరళీకరించిన సెబీ

Thursday 13th December 2018
Markets_main1544676953.png-22877

ముంబై: పలు సంస్కరణల్లో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం స్టార్టప్‌ల లిస్టింగ్‌ నిబంధనలను సరళీకరించింది. పెట్టుబడుల రాబడుల రక్షణ కోసం ఒత్తిడి ఆస్తులను విడగొట్టే వెసులుబాటును మ్యూచువల్‌ ఫం‍డ్స్‌కు కల్పించింది. లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రమోటర్లు తమ వాటాను తగ్గించుకోవడానికి ఉపయోగించుకునే ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానాన్ని మరింతగా విస్తరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సంబంధించిన పెట్టుబడుల పరిమితి నిబంధనలను సరళీకరించింది. 
బుధవారం జరిగిన కీలక బోర్డ్‌  సమావేశంలో సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్లో సంస్థాగత ఇన్వెస్టర్లు మరింత అధికంగా పాలుపంచుకునేందుకు గాను కస్టోడియల్‌ సర్వీసెస్‌ను అనుమతించాలని కూడా సెబీ నిర్ణయించింది. 
స్టార్టప్‌ నిబంధనలు సడలింపు: భారత్‌లో స్టార్టప్‌ల లిస్టింగ్‌ జోరును పెంచడానికి సెబీ కీలకమైన చర్యలు తీసుకుంది. ఈ-కామర్స్‌, డేటా ఎనలిటిక్స్‌, బయోటెక్నాలజీ వంటి కొత్త తరం స్టార్టప్‌లు నిధుల సమీకరణ, లిస్టింగ్‌నకు సంబంధించిన నిబంధనలను సెబీ సరళీకరించింది.​ స్టార్ట్లప్‌ల లిస్టింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ పేరును. ఇన్‌స్టిట్యూషనల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ నుంచి ఇన్నోవేటర్స్‌ గ్రోత్‌ ప్లాట్‌ఫార్మ్‌గా మార్చింది. 
 ప్రస్తుతం టాప్‌ 200 కంపెనీలకు మాత్రమే వర్తిస్తున్న ఓఎఫ్‌ఎస్‌ నిబంధనలు రూ.1,000 కోట్లు, అంతకు మించిన మార్కెట్‌ క్యాప్‌ ఉన్న అన్ని కంపెనీలకూ వర్తిస్తాయని సెబీ పేర్కొంది. 



You may be interested

‘నాగార్జున ఆయిల్‌’ ఆస్తుల అమ్మకం

Thursday 13th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాగార్జున ఆయిల్‌ రిఫైనరీకి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో (ఎన్‌సీఎల్‌టీ) ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ అనుబంధ కంపెనీ అయిన నాగార్జున ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌వోసీఎల్‌) ఆస్తులను విక్రయించాల్సిందిగా (లిక్విడేషన్‌) ఎన్‌సీఎల్‌టీ చెన్నై బెంచ్‌ తీర్పు వెలువరించింది. ఎన్‌వోసీఎల్‌కు మొత్తం రూ.9,000 కోట్ల అప్పులున్నాయి. ఇందులో 15 బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.8,000 కోట్లు. హల్దియా పెట్రోకెమికల్స్‌, గల్ఫ్‌ పెట్రోకెమికల్స్‌లు ఇప్పటికే పరిష్కార ప్రణాళికతో ముందుకొచ్చాయి. అయితే

జోరుగా బంధన్‌ బ్యాంక్‌ విస్తరణ

Thursday 13th December 2018

కోలకతా: ప్రైవేట్ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన బంధ‌న్ బ్యాంక్ ఈ ఏడాది చివరినాటికి 40 కొత్త శాఖలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 31 నాటికి బ్యాంక్‌ మొత్తం శాఖల సంఖ్య 978కి చేరుకోనున్నట్లు ఆ బ్యాంక్‌ సీఈఓ చంద్రశేఖర్‌ ఘోష్‌ ప్రకటించారు. ఇందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించినట్లు తెలియజేశారు. వాటా తగ్గింపునకు సంబంధించిన నిబంధనలను పాటించని కారణంగా గతంలో నూతన శాఖల ఏర్పాటుకు ఆర్‌బీఐ

Most from this category