STOCKS

News


స్టార్టప్‌ లిస్టింగ్ నిబంధనలు సడలించడంపై సెబీ దృష్టి

Monday 10th December 2018
Markets_main1544417476.png-22791

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో స్టార్టప్‌ల లిస్టింగ్‌ను ప్రోత్సహించే క్రమంలో నిబంధనలను సరళతరం చేయడంపై  మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ-కామర్స్‌, డేటా అనలిటిక్స్‌, బయోటెక్నాలజీ తదితర రంగాల స్టార్టప్‌ల నిధుల సమీకరణకు తోడ్పడే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వీటిని ఈ వారంలో జరిగే బోర్డు సమావేశంలో సెబీ చర్చించనుంది. అలాగే, ఈ తరహా సంస్థల లిస్టింగ్‌ కోసం ఉద్దేశించిన 'ఇనిస్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం' పేరును 'ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్‌ఫాం'గా మార్చే ప్రతిపాదననూ పరిశీలించనుంది. ప్రస్తుత ప్లాట్‌ఫాం.. మార్కెట్‌ వర్గాలను అంతగా మెప్పించలేకపోవడం, స్టార్టప్‌ల లిస్టింగ్‌ నిబంధనలను మరింతగా సడలించాలన్న డిమాండ్లు వస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో సెబీ ఈ మేరకు చర్యలు తీసుకుంటోంది. ప్రతిపాదిత మార్పుల ప్రకారం.. ప్రీ-ఇష్యూ క్యాపిటల్‌లో కనీసం 50 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వద్ద ఉండాలన్న నిబంధనను తొలగించే అవకాశం ఉంది.  అలాగే, పోస్ట్ ఇష్యూ క్యాపిటల్‌కి సంబంధించి 25 శాతం పరిమితిని తొలగించేయవచ్చు. ఇక, షేర్ల కొనుగోలుకు సంబంధించి కనీస దరఖాస్తు పరిమాణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 2 లక్షలకు తగ్గించవచ్చు. 



You may be interested

5 రోజుల్లో రూ. 400 కోట్లు

Monday 10th December 2018

న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్‌వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత 5 సెషన్స్‌లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3-7 మధ్య వ్యవధిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్‌ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ఆర్‌ఈసీ మైనారిటీ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ లేనట్టే

Monday 10th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మరో ప్రభుత్వరంగ కంపెనీ ఆర్‌ఈసీని కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ అనుమతించిన నేపథ్యంలో... ఆర్‌ఈసీ మైనారిటీ వాటాదారులకు పీఎఫ్‌సీ ఎటువంటి ఓపెన్‌ ఆఫర్‌ చేయదని ఓ సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు. ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వానికి 52.63 శాతం వాటా ఉంది. ఈ వాటాను పీఎఫ్‌సీ కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.10,500 కోట్లు సమకూరనున్నాయి. కొనుగోలు తర్వాత పీఎఫ్‌సీ అనుబంధ

Most from this category