STOCKS

News


ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల్లో  మార్పులు !

Monday 10th September 2018
Markets_main1536557342.png-20122

న్యూఢిల్లీ:  కొత్త కేవైసీ నిబంధనలకు సంబంధించి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు)ఊరటనిచ్చే నిర్ణయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ  శనివారం తీసుకుంది.  ఈ కొత్త కేవైసీ నిబంధనలపై ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ హెచ్‌. ఆర్‌. ఖాన్‌ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి సంఘం పలు వివాదాస్పద విషయాలపై చాలా మార్పులను సూచించింది. ఈ సిఫార్సుల ప్రకారం ఎన్నారైలు, ఓసీఐలు (ఓవర్సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా), ఆర్‌ఐలు (రెసిడెంట్‌ ఇండియన్స్‌) విదేశీ ఫండ్స్‌లో 50 శాతం లోపువాటాను కలిగివుండవచ్చు. ఆ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఆయా ఇన్వెస్టర్లపై ఎటువంటి నియంత్రణలూ వుండవు. అలాగే ఆయా ఇన్వెస్టర్ల కెవైసీకి అదనపు డాక్యుమెంట్లను సమర్పించనక్కర్లేదని సూచించింది. కొత్త మార్గదర్శకాలకు తుది రూపు ఇచ్చే ముందు ఈ మార్పులపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సెబీ నిర్ణయించింది. ఈ నెల 17 వరకూ హెచ్‌.ఆర్‌. ఖాన్‌ కమిటీ నివేదికపై ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని సెబీ పేర్కొంది. నివాస భారతీయులు, ప్రవాసభారతీయులు...విదేశీ ఫండ్స్‌ ద్వారా నిధుల్ని దేశీయ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న కారణంగా కొత్తగా కైవైసీ నిబంధనల్ని గతంలో సెబి జారీచేసింది.  సెబీ  కేవైసీ నిబంధనల కారణంగా 7,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు తరలిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 



You may be interested

సెబీ ముందుకు త్వరలో చందా కొచర్‌..

Monday 10th September 2018

న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో నిబంధనల ‍అతిక్రమణ ఆరోపణలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త దీపక్ కొచర్‌లను ప్రశ్నించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల్లో, వీడియోకాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా సమనల్ు జారీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై వివిధ దర్యాప్తు సంస్థల

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిబెంచర్ల రేటింగ్ డౌన్‌గ్రేడ్‌

Monday 10th September 2018

న్యూఢిల్లీ:  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాలు, డిబెంచర్ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసినట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. భారీ స్థాయిలో రుణాల చెల్లింపులు జరపాల్సి ఉండటం, నిధులపరమైన ఒత్తిళ్లు నెలకొనడంతో డిఫాల్టు రిస్కులు ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. రూ. 5,225 కోట్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ ప్రోగ్రామ్ దీర్ఘకాలిక రేటింగ్‌ను, రూ. 350 కోట్ల టర్మ్ రుణాల రేటింగ్‌ను 'ఎఎప్లస్‌' నుంచి 'బిబి' స్థాయికి తగ్గించినట్లు ఇక్రా

Most from this category