STOCKS

News


ఆనంద్‌ రాఠి, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లకు సెబీ షాక్‌

Wednesday 27th February 2019
Markets_main1551242437.png-24356

న్యూఢిల్లీ: నేషనల్‌ స్పాట్‌ ఎక్స్చేంజ్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఈఎల్‌) స్కామ్‌ నేపథ్యంలో  కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్‌గా వ్యవహరించడానికి రెండు కంపెనీలకు సెబీ ఆమోదాన్ని నిరాకరించింది. ఆనంద్‌ రాఠి కమోడిటీస్‌, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లు... కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా వ్యవహరించడానికి అర్హత లేదని సెబీ పేర్కొంది. ఈ మేరకు రెండు వేర్వేరు ఆదేశాలను సెబీ జారీ చేసింది. కమోడిటీ డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా వ్యవహరించడానికి ఆనంద్‌ రాఠి కమోడిటీస్‌, జియోఫిన్‌ కామ్‌ట్రేడ్‌లు చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించింది. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఈ సంస్థలు డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా వ్యవహరించడానికి లేదని ఆదేశించింది. తమ దరఖాస్తును సెబీ తిరస్కరించడం వల్ల తమ గ్రూప్‌ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడదని ఆనంద్‌ రాఠి కమోడిటీస్‌ పేర్కొంది. సెబీ ఉత్తర్వులను పరిశీలిస్తున్నామని, ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్‌ చేయడానికి తగన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇటీవలే మోతిలాల్‌ ఓస్వాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌ కమోడిటీ సంస్థలకు కమోడీటీ డెరివేటివ్స్‌ బ్రోకర్లుగా కొనసాగే అర్హత లేదంటూ సెబీ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.



You may be interested

స్థిరంగా పసిడి

Wednesday 27th February 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత కారణంగా ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.45డాలర్ల స్వల్ప లాభంతో 1,329.95 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది. అమెరికా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పలు ప్రతికూలాంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారాయి. అయినప్పటికీ.., వడ్డీరేట్ల పెంపుపై మరి కొంతకాలం సహనం పాటిస్తామని ఫెడ్‌ రిజర్వ్‌

జియోకు రూ.15,000 కోట్ల నష్టం..!

Wednesday 27th February 2019

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్‌ జియో రూ15,000 కోట్ల నష్టాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రముఖ బ్రోక‌రేజ్ కంపెనీ బెర్న్‌స్టెయిన్ అంచనావేసింది. పోటీ సంస్థలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు ప్రకటించనున్న నష్టాల కంటే.. ఈ సంస్థ నష్టమే భారీ స్థాయిలో ఉండనుందని తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.830 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తరుగుదల, సబ్సిడీ వ్యయం వంటి అంశాలను

Most from this category