STOCKS

News


కమోడిటీ ట్రేడింగ్‌ సమయం పెరిగింది

Saturday 1st December 2018
Markets_main1543643121.png-22541

న్యూఢిల్లీ: కమోడిటీ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ సమయం మరింతగా పెరగనుంది. అంతే కాకుండా ట్రేడింగ్‌లో పాల్గొనడానికి రైతు సంఘాలను, విదేశీ సంస్థలను సెబీ అనుమతించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ మార్కెట్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ నిర్ణయాలు తీసుకుంది. సవరించిన వేళల ప్రకారం, వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్‌  ఉదయం 9 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి గం.11.55 నిమిషాల వరకూ కొనసాగుతుంది. గతంలో ట్రేడింగ్‌ సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి గం.11.55 వరకూ ఉండేది. 
ఇక వ్యవసాయ, వ్యవసాయ ప్రాసెస్డ్‌ కమోడిటీల ట్రేడింగ్‌ ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 9కి ముగుస్తుంది. గతంలో ఈ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ ఉదయం 10 నుంచి రాత్రి 9.30 వరకూ ఉండేది. ఈ మేరకు గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు తమ కమోడిటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ వేళలను సరిచేసుకోవాలని సెబీ పేర్కొంది. సవరించిన ట్రేడింగ్‌ వేళలు ఈ సర్క్యులర్‌ వెలువడిన నెల రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని, స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు తమ నియమ నిబంధనల్లో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సెబీ సూచించింది. కమోడిటీ డెరివేటివ్స్‌ అడ్వైజరీ కమిటీ సూచనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ తెలిపింది. 



You may be interested

గవర్నెన్స్ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం

Saturday 1st December 2018

ముంబై: యస్‌ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ నిరాకరించడానికి గవర్నెన్స్‌ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న అప్పటి చైర్మన్ అశోక్‌ చావ్లాకు రాసిన లేఖలో ఆర్‌బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్

డేటా భద్రత బిల్లుపై విస్తృత చర్చలు..

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా భద్రత బిల్లు ముసాయిదాపై అంతర్‌ మంత్రిత్వ శాఖలతో పాటు సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చలు జరపనున్నట్లు కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీన్ని సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రతిపాదిత చట్టాన్నొక 'మైలురాయి'గా అభివర్ణించిన రవి శంకర్ ప్రసాద్.. ముసాయిదా బిల్లుపై కూలంకషంగా చర్చలు జరపాలని, అభిప్రాయాలు సేకరించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

Most from this category